Moviesశ్రీలీల బికినీ వేసి లిప్ కిస్ ఇవ్వాలా... వీళ్ల‌కు ఇదేం కోరిక‌రా...

శ్రీలీల బికినీ వేసి లిప్ కిస్ ఇవ్వాలా… వీళ్ల‌కు ఇదేం కోరిక‌రా బాబు..!

యంగ్ బ్యూటీ శ్రీలీల అటు తోటి హీరోయిన్స్‌కి ఇటు అభిమానులకి, ప్రేక్షకులకి చమటలు పట్టిస్తోంది. దర్శకేంద్రుడి సినిమా అంటే హీరోయిన్ ఖచ్చితంగా పాపులర్ అవ్వాల్సిందే. ఆ కోవలోనే శ్రీలీల కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. ఇంకా చెప్పాలంటే వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. మొదటి సినిమా పెళ్లి సందడి ఫ్లాపైనా కూడా శ్రీలీలకి మాత్రం మంచి పేరు గుర్తింపు దక్కింది.

ఆ తర్వాత యంగ్ హీరోలతో సినిమాలు చేస్తుందనుకుంటే ఊహించని విధంగా సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ధమాకా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాకిచ్చింది. మాళవిక శర్మ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ లాంటి అప్‌కమింగ్ హీరోయిన్స్ రవితేజ సరసన నటించి అడ్రస్ లేకుండా పోయారు. దాంతో క్యూట్ లుక్స్ ఉన్న ఈ యంగ్ బ్యూటీ కెరీర్ కూడా ధమాకా తర్వాత ఢమాల్ అనుకున్నారు.

కానీ, ఈ సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్‌తో ఇరగ్గొట్టింది. సాంగ్స్ బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. రవితేజ ఏజ్‌కి తగ్గట్టుగా శ్రీలీలను శారీ కట్టించి మేనేజ్ చేశారు. కాస్త పెద్దదానిలాగా చూపించారు. అయినా మెప్పించింది. ఇక అమ్మడి టైం బావుంది కాబట్టి ధమాకా కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది. ధ‌మాకా ర‌వితేజ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం రు. 100 కోట్ల సినిమాగా రికార్డుల‌కు ఎక్కేసింది.

దాంతో శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సినిమా చేస్తోంది. అలాగే తెలుగులో రాం, బోయపాటి సినిమా..వారాహి సంస్థ నిర్మించే మరో సినిమాతో పాటు ఓ కన్నడ సినిమానూ చేస్తోంది. అన్నిటికంటే షాకింగ్ విషయం పూజా హెగ్డే మేయిన్ హీరోయిన్ అయినా మహేష్ సినిమాలో ఈ బ్యూటీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

దాంతో ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్స్ అందరికీ టెన్షన్ మొదలైందంటున్నారు. ఇటు బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమాలో బాల‌య్య‌కు కూతురుగా న‌టిస్తోంది. అయితే చాలా మంది నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో శ్రీలీల బికినీ వేసి లిప్‌కిస్ ఇస్తే చూడాల‌నుకుంటున్నామ‌ని కామెంట్లు పెడుతున్నారు. అదే జ‌రిగితే అస‌లు కుర్ర‌కారుకు ఓ నెల రోజులు నిద్ర‌లు ఉండ‌వు. మొత్తానికి శ్రీలీల తోటి హీరోయిన్స్‌కి దడ పుటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news