Moviesఓరి దేవుడో..కాజల్ మళ్ళీ ప్రెగ్నెంటా..? చచ్చం పో..!!

ఓరి దేవుడో..కాజల్ మళ్ళీ ప్రెగ్నెంటా..? చచ్చం పో..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ..తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ” లక్ష్మీ కళ్యాణం ” అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్.. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది . ఫస్ట్ సినిమా అయినా సరే తన అమాయకపు లుక్స్ తో అద్భుతమైన నటనతో తెలుగు జనాలను మెప్పించింది . మొదటి సినిమాతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కాజల్ ..ఆ తర్వాత రెండో సినిమాకి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన మగధీర సినిమాలో అవకాశం అందుకుంది . ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో ..ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ కెరియర్ ఎంత దూసుకుపోయిందో ..అదే విధంగా కాజల్ హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీని ఏలేసింది . రెండు దశాబ్దాలు పాటు మకుటం లేని మహారాణిగా తెలుగు -తమిళ్ -హిందీ ఇండస్ట్రీలో రాజ్యమేలేసింది . కాగా సినిమా ఆఫర్స్ పిక్స్ లో వస్తుండగానే చిన్న నాటి ఫ్రెండ్ ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది . కాజల్ – గౌతమ్ పెళ్ళి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్యలో గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత పండు లాంటి బీల్ కిచ్చులుకు జన్మనిచ్చింది . ఈ క్రమంలోనే తన ప్రేగ్నెన్సీ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న కాజల్ ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ తన ప్రేగ్నేన్సి లైఫ్ ని జనాలకు పరిచయం చేసింది.

కాగా ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్న కాజల్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .దానికి కారణం రీసెంట్గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు బేబీ బంప్ లా కనిపిస్తూ ఉండడమే. ప్రెగ్నెన్సీ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్న కాజల్ ..తన బాడీని త్వరగా పూర్వ కాజల్ గా మార్చేసింది . పర్ఫెక్ట్ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఫ్యాన్స్ కు అందాల ట్రీట్ ఇచ్చింది . అయితే గత కొన్ని రోజులుగా కాజల్ మళ్ళీ లావైనట్లు తెలుస్తుంది . రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలో బేబీ బంప్ తో దర్శనం ఇవ్వడంతో ఆమె మళ్ళీ ప్రెగ్నెంటా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు .

ఒకవేళ నిజంగా అదే నిజమైతే కాజల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తో పాటు బ్యాడ్ న్యూస్ కూడా వెంటే వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయితే కాజల్ ఇప్పుడు నటిస్తున్న సినిమాలు అన్నింటి నుంచి తప్పుకుంటుంది ..కాజల్ 9 నెలలు కంప్లీట్ అయి బేబీ పుట్టి వచ్చేసరికి అమ్మడి స్దానం లోకి వేరే హీరోయిన్స్ వచ్చేస్తారు . కాజల్ ఫెడ్ అవిట్ అయిపోతుంది . ఇక తెరపై ఇద్దరు పిల్లలతో కాజల్ కనిపించడం ళ కల్లో కూడా జరగని పని అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news