Moviesఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు... అలాంటి కష్టాన్ని అనుభవిస్తున్న చిత్ర..!!

ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు… అలాంటి కష్టాన్ని అనుభవిస్తున్న చిత్ర..!!

సినిమా ఇండస్ట్రీలో సింగర్ చిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన అందమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చిత్ర.. దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడి జనాలని మెప్పించింది . భారతీయ భాషలతో పాటు మలై , లాటిన్ , అరబిక్ , ఇంగ్లీష్, ఫ్రెంచ్ తదితర విదేశీ భాషల్లోనూ తన గాన ప్రతిభను నిరూపించుకొని అందరి చేత శభాష్ అనిపించుకున్నింది. అంతేకాదు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ ,ఎస్పీ బాలసుబ్రమణ్యం ,ఏసుదాసు హంసలేఖ వంటి సంగీత దిగ్గుజాలతో కలిసి పనిచేసిన ఘనత అందుకుంది చిత్ర .

కాగా కెరియర్లో అత్యంత ఎత్తుకు ఎదిగిన చిత్ర జీవితంలో మాత్రం ఓ విషయంలో ఇప్పటికి బాధపడుతూనే ఉంది . మనకు తెలిసిందే సింగర్ చిత్ర కూతురు 2011లో మరణించారు . చిత్ర విజయశంకర్ అనే ఓ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంది . వీరికి నందనా అనే ఒక పాప కూడా పుట్టింది. అయితే పాప డౌన్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడేది. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే మనుషులను అస్సలు గుర్తుపట్టలేరు ..ఎదగలేరు .

కాగా నందనకు 9 ఏళ్లు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయింది. ఆ టైంలో చిత్ర కచేరిలో ఉన్నింది. కాగా నిన్న నందన పుట్టినరోజు ఈ క్రమంలోనే తన కూతుర్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది చిత్ర. ఆమెకి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ” స్వర్గంలో దేవకన్యాలతో నీ పుట్టిన రోజుని సెలబ్రేట్ జరుపుకుంటున్నావని నేను అనుకుంటున్నాను ..హ్యాపీ బర్త్డే నందన “అంటూ చెప్పుకు వచ్చింది. దీంతో చిత్ర ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news