Moviesఅఫీషియ‌ల్‌: సినిమాల‌కు స‌మంత గుడ్ బై ? షాకింగ్ రీజ‌న్ ఇదే..!

అఫీషియ‌ల్‌: సినిమాల‌కు స‌మంత గుడ్ బై ? షాకింగ్ రీజ‌న్ ఇదే..!

స్టార్ హీరోయిన్ సమంత విషయంలో గుండెలు పగిలే విషయం బయటకు వచ్చేసింది. సమంత కెరీర్ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పర్సనల్ లైఫ్ లోను ఆమె ఎన్నో కష్టాలు పడుతున్నా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా సమంతకు సినిమాలపరంగా ఎన్నో ఛాన్సులు వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వెబ్ సిరీస్లలోనూ ఆమెకు అదిరిపోయే ఛాన్సులు చేతిలో ఉన్నాయి. అయితే సమంత ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని షాకింగ్ నిర్ణయం తీసుకుందని.. దీనిపై రేపో మాపో అధికారిక ప్రకటన కూడా రానుందని తెలిసింది.

ప్ర‌స్తుతం స‌మంత మ‌యోసైటీస్ ఇమ్యూన్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సమంత ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఇది ఇలా ఉంటే సమంతకు బాలీవుడ్లో ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో అదిరిపోయే క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో సమంత ఎంత హాట్‌గా కనిపించిందో చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ లో సమంత హాట్ గా కనిపించడం అక్కినేని కుటుంబానికి నచ్చలేదని… వారి విడాకులకు కూడా ఇది కారణమైందన్న ప్రచారం జరిగింది.

విడాకుల‌ తర్వాత సమంత బాలీవుడ్ లో వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక తెలుగులోను ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం – విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషి సినిమాలో నటిస్తోంది. అటు తమిళంలోనూ కొన్ని సినిమాలకు సంతకం చేసింది. వీటితో పాటు హాలీవుడ్ లోనూ ఒక మూవీకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సమంత అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉండడంతో స్వల్పకాలం షూటింగ్‌ల‌కు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజా అప్డేట్ ప్రకారం సమంత బాలీవుడ్ సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆమె బీ టౌన్‌లో సినిమాలు చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎక్కువ సినిమాలు ఉన్నాయి. దీంతో సమంత తెలుగుతోపాటు తమిళ సినిమాలు సౌత్ సినిమాలపై ఫోకస్ చేయాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీటౌన్‌ సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకుందట.

దీనిపై రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని కూడా సమాచారం. అయితే సమంత నిర్ణయాన్ని బాలీవుడ్ నిర్మాతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఆమె సంతకం చేసిన బాలీవుడ్ సినిమాలు ఆలస్యం అయితే తమకు కోట్లలో నష్టం వస్తుందని.. కచ్చితంగా తమ సినిమాలకు పూర్తి చేయాల్సిందే అని వారు కండిషన్ లు పెడుతున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news