Moviesఆ కండీష‌న్‌తో భార్య కోరిక తీర్చేసిన ఎన్టీఆర్‌... ప్ర‌ణ‌తి పిచ్చ హ్యాపీ...!

ఆ కండీష‌న్‌తో భార్య కోరిక తీర్చేసిన ఎన్టీఆర్‌… ప్ర‌ణ‌తి పిచ్చ హ్యాపీ…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది మార్చిలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని స్టార్‌డం తెచ్చుకున్నాడు. త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రు. 1200 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను కొల్లగొట్టింది. రీసెంట్‌గా జపాన్ లో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ అక్కడ కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యి 9 నెలలు అవుతున్న ఎన్టీఆర్ నెక్ట్స్‌ సినిమా ఇంకా పట్టాలు ఎక్కలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కి సినిమా వచ్చే యేడాది నుంచి కంటిన్యూగా షూటింగ్ జరుపుకోనుంది.

తారక్‌ కెరీర్లో 30వ ప్రాజెక్టుగా కొరటాల శివ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత తారక్ 31వ ప్రాజెక్టు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సినిమాగా రానున్న సంగతి తెలిసిందే. కొరటాల కస‌ర‌త్తులు చేస్తుండడంతో పాటు హీరోయిన్లు.. ఇతర కాస్టింగ్ ఎంపికలో ఆల‌స్యం అవడంతో ఈ ప్రాజెక్టు ఇంకా పట్టాలు ఎక్కలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరి కాస్త సమయం పట్టేలా ఉండడంతో తారక్‌ తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.

తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు పిల్లలతో కలిసి విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్న తారక్ లేటెస్ట్‌గా అందమైన ఫోటోను షేర్ చేసుకోవడంతో ఇప్పుడు అది వైరల్ అవుతుంది. తారక్ కొరటాల శివ… ఆ వెంటనే ప్రశాంత్ నీల్‌ సినిమాల కోసం ఏడాది పాటు కంటిన్యూగా కాల్ షీట్లు ఇచ్చేశాడు. కొరటాల శివ సినిమా సెట్స్ మీదకి వెళితే అస్సలు ఖాళీ ఉండదు.. ఫుల్ బిజీ అయిపోతాడు.

అందుకే ఏడాది పాటు ఇక విహారయాత్రలతో పాటు ఎంజాయ్మెంట్ ఉండ‌ద‌న్నట్టుగానే భార్య‌ ప్రణతితో పాటు పిల్లలను తీసుకుని విహారయాత్రకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఫోటోలో ప్రణతిని కౌగిలించుకొని ఆమెపై తనకు ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తం చేస్తూ నుదుటిపై ముద్దు పెడుతున్నాడు. ప్రణతి తారక్ కౌగిలిలో బంది అయిపోయి అతడు చేతుల్లో ఆలింగనం అయ్యి భర్త ప్రేమను ఆస్వాదిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news