Moviesజ‌య‌సుధ - ఎన్టీఆర్ కాంబినేష‌న్‌కు ఇదో బ్యాడ్ సెంటిమెంట్‌...!

జ‌య‌సుధ – ఎన్టీఆర్ కాంబినేష‌న్‌కు ఇదో బ్యాడ్ సెంటిమెంట్‌…!

ఎన్టీఆర్‌.. జ‌య‌సుధ క‌లిసి అనేక సినిమాల్లో న‌టించారు. కొన్ని సినిమాల్లోనేరుగా హీరో హీరోయిన్లుగా న‌టించారు. మ‌రికొన్నింటిలో సెకండ్ హీరోయిన్‌గా కూడా అన్న‌గారి స‌ర‌స‌న జ‌య‌సుధ‌ న‌టించింది. అయి తే.. ఈ ఫెయిర్ హిట్టా.. ఫ్లాపా.. అంటే మాత్రంఎటూ చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే.. కొన్ని హిట్ట‌యిన‌వీ ఉన్నాయి.. ఫెయిల్ అయిన‌వీ ఉన్నాయి. అలాగ‌ని ఫ్లాప్ పెయిర్ అని చెప్ప‌లేం.

గ‌జ‌దొంగ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రీదేవి. సెకండ్ హీరోయిన్‌..జ‌య‌సుధ‌. కానీ, క‌థ‌లో అత్యంత కీల‌క స‌న్నివేశాలు.. జ‌య‌సుధ చుట్టూనే తిరుగుతాయి. కానీ, ఎన్టీఆర్ -జ‌య‌సుధ‌కు ఈ సినిమాలో హిట్ పెయిర్ టాక్ రాలేదు. ఇక‌, యుగంధ‌ర్ వంటి సూప‌ర్ హిట్‌ మూవీలోనూ.. అన్న‌గారితో న‌టించిన జ‌య‌సుధ‌కు పెద్ద‌గా టాక్ రాలేదు. అడ‌వి రాముడు సినిమాలో జ‌య‌ప్ర‌ద‌-జ‌య‌సుధ క‌లిసి న‌టించారు.

ఇక్క‌డ కూడా జ‌య‌సుధ‌ కంటే.. జ‌య‌ప్ర‌ద‌కే మార్కులు ఎక్కువ‌గా ప‌డ్డాయి. దీంతో త‌ర్వాత సినిమాల్లో అన్న‌గారితో క‌లిసి న‌టిచేందుకు ఒప్పుకొన్నా.. సెకండ్ హీరోయిన్‌గా మాత్రం జ‌య‌సుధ న‌టించిన దాఖ‌లాలు లేవు. దీంతో ఆ త‌ర్వాత‌.. వ‌చ్చిన సినిమాల్లో పేరు బాగానే వ‌చ్చింది. అయితే.. జ‌య‌ప్ర‌ద‌-ఎన్టీఆర్‌, శ్రీదేవి-ఎన్టీఆర్ త‌ర‌హాలో మాత్రం పేరు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

KD No 1 Songs - Malli Malli Andhi - NTR Jayasudha - video Dailymotion

ఇక‌, చివ‌ర‌కు.. శ్రీనాధ క‌విసార్వ‌భౌమ సినిమాలో బాపు డైరెక్ష‌న్‌లోనూ ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. అయితే.. ఈ సినిమా ఫెయిల్ అయింద‌నుకోండి. అయిన‌ప్ప‌టికీ.. అంత హిట్ ఫెయిర్ అనే నేమ్ మాత్రం సొంతం చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా జ‌య‌సుధ – ఎన్టీఆర్ కాంబినేష‌న్‌కు మిగిలిన హీరోయిన్ల‌తో ఎన్టీఆర్ కాంబినేష‌న్‌కు ఉన్నంత నేమ్ రాలేదు. ఇదో సెంటిమెంట్‌గా ఉండిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news