Moviesమహేశ్ కోసం బాహుబలి స్ట్రాటజీ.. జక్కన్న మామూలు ముదురు కాదండోయ్..!!

మహేశ్ కోసం బాహుబలి స్ట్రాటజీ.. జక్కన్న మామూలు ముదురు కాదండోయ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా నటించిన సర్కారి వారి పాట . ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయి మహేష్ బాబు అభిమానులనే కాకుండా అందరికీ సమాంతరంగా సాటిస్ఫై చేసిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ అందాలు మరింత ప్లస్ గా నిలిచాయి . మరీ ముఖ్యంగా మహేష్ బాబు – కీర్తి లవ్ ట్రాక్ ఈ సినిమాకి హైలెట్ గా మారింది.

కాగా ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న నెక్స్ట్ మూవీ స్సంబ్28 . త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మహేష్ బాబు .. రెండో షెడ్యూయల్ కి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకి సంబంధించిన జిమ్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. ఈ సినిమా కంప్లీట్ అయిన మరోక్షణమే కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్సంబ్29 సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు మహేష్ బాబు.

రాజమౌళి డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకునేలా చేసింది. రీసెంట్గా లిక్ అయిన అప్ డేట్ మహేష్ బాబు అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది .రాజమౌళి కెరియర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ బాహుబలి సిరీస్ లాగే మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేసుకున్నాడట రాజమౌళి . ఈ న్యూస్ తో మహేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది . బాహుబలి స్ట్రాటజీ వర్కౌట్ అయితే మాత్రం బాహుబలిని తలదన్నే రేంజ్ లో ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు సినీ ప్రముఖులు . చూద్దాం మహేష్ బాబు జాతకం ఎలా మారుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news