Moviesఅవ‌స‌రాల చెప్పాడ‌నే ఆ హీరోయిన్ అవ‌న్నీ చూపించేసిందా...!

అవ‌స‌రాల చెప్పాడ‌నే ఆ హీరోయిన్ అవ‌న్నీ చూపించేసిందా…!

నటుడు, రచయితదర్శకుడు అవసారల శ్రీనివాస్‌లో మంచి రొమాంటిక్ ఫెలో ఉన్నాడు. అష్టా చమ్మా సినిమాతో నానితో పాటు కలిసి నటించిన అవసారాల శ్రీనివాస్‌కి నటుడిగా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కూడా నటుడిగా చాలా సినిమాలు చేశారు. చేసిన ప్రతి సినిమాలో అవసరాల తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకవైపు కథ రాసుకుంటూ నటుడిగా సినిమాలు చేయడం అంటే కాస్త కష్టమే.

 

అందులోనూ నూటొక్క జిల్లాల అందగాడు, బాబు బాగా బిజీ లాంటి చాలెంజింగ్ పాత్రలంటే అవసరాల చాలా కష్టపడాల్సి వస్తుంది. అన్నిటినీ సమర్థవంతగా చేసుకుంటూ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. దర్శకుడిగా మంచి సినిమాలు చేస్తున్న ఈ టాల్ హీరో బాబు బాగా బిజీ లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడం చాలామందికి షాకిచ్చింది. ఇందులో ఆయన హీరోయిన్‌తో చేసిన రొమాంటిక్ సీన్స్ వేడి పుట్టించాయి. జనాలు కూడా బాగా ఎంజాయ్ చేశారు.

అయితే, అవసరాల శ్రీనివాస్ ఒక హీరోయిన్‌ను ఎంచుకునే ముందు తన పాత్ర ఇదనీ ఖచ్చితంగా చెప్పి పూర్తి స్థాయిలో ఆమె సంతృపి చెందితేనే తీసుకుంటాడట. ఇలా తన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమా విషయంలో చాలా తర్జన భర్జన పడ్డాట. దర్శకుడిగా అవసరాలకి అదే మొదటి సినిమా. చాలామంది హీరోయిన్స్‌ను చూశాక ఫైనల్‌గా మద్రాస్ కేఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రాశీఖన్నా మీద కన్ను పడిందట.

అంతే, ఎలాగైనా ఈ సినిమాలో తననే హీరోయిన్‌గా ఫిక్స్ చేయాలని డిసైడయి..సెలెక్ట్ చేశాడట. ఇక దర్శకుడిగా మొదటి సినిమా కావడంతో కొన్ని సీన్స్, బీచ్ సాంగ్‌లో రాశీని బాగా వాడాడ‌ట. ముఖ్యంగా బీచ్ సాంగ్‌లో రాశితో డీప్ నెక్ ఉన్న కాస్ట్యూం వేయించి క్లీవేజ్ షోతో అలరించేలా మాట్లాడి ఒప్పించాడట. రాశి కూడా మొదటి సినిమా కావడంతో తన ఎద అందాల ప్రదర్శనకి ఏ మాత్రం అడ్డు చెప్పలేదని చెప్పుకున్నారు. ఈ సాంగ్ కుర్రాళ్ళకి బాగానే చమటలు పట్టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news