Moviesఇన్నాళ్లకు ఆ కల నెరవేరిందోచ్.. చాలా కాలం తరువాత సంతోషం గా...

ఇన్నాళ్లకు ఆ కల నెరవేరిందోచ్.. చాలా కాలం తరువాత సంతోషం గా ఉన్న బ్రహ్మానందం ..రీజన్ ఇదే..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం అన్న పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . కొన్ని వందల సినిమాల్లో నటించి ప్రజలను కడుపుబ్బా నవ్వించిన ఘనత సాధించాడు . తెరపై బ్రహ్మానందం కనిపిస్తే చాలు పకపకా నవ్వేసే జనాలు ఎంతో మంది ఉన్నారు. ఎలాంటి కామెడీ రోల్స్ నైనా సరే తనదైన స్టైల్ లో నటించి ఆ పాత్రకే కొత్తగా ప్రాణం పోసే సత్తా ఉన్న కమెడియన్ బ్రహ్మానందం. ఇతని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన కమెడియన్స్ బోలెడు మంది ఇప్పటికే తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు బ్రహ్మానందం .

 

కాగా బ్రహ్మానందం ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి . ఈ క్రమంలోనే ఆయన కొడుకు గౌతమ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బ్రహ్మానందం కి ఇద్దరు కొడుకులు.. వాళ్ళల్లో ఒకరే గౌతమ్ ..ఈయన పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే ఎందుకు అవకాశాలు అందుకోలేకపోయాడు . ఆ తర్వాత వచ్చిన అరాకొరా సినిమాల ద్వారా ప్లాపులు తన ఖాతాలో వేసుకున్నాడు .

ఈ క్రమంలో పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన గౌతమ్ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉన్నాడు . కాగా ఈయన భార్య రీసెంట్గా ఓ పాపకు జన్మనిచ్చింది. దీంతో బ్రహ్మానందం ఇంట సంబరాలు మొదలయ్యాయి . అంతేకాదు ఆల్రెడీ వీళ్లిద్దరికి ఒక బాబు ఉన్నాడు. రీసెంట్ గా వీరింటికి మహాలక్ష్మి రూపంలో పాప రావడం తో బ్రహ్మానందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . అంతేకాదు ఇప్పుడు బ్రహ్మానందం మనవడితోపాటు మనవరాలతో కూడా ఆడుకోవచ్చు ..ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అంటున్నారు జనాలు. దీంతో బ్రహ్మానందం హ్యాపీనెస్ డబుల్ అయిందని ఫుల్ జోష్ లో ఉన్నాడని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news