Moviesఅడిగి మరి తన సినిమా లో ఆ హీరోయిన్ ని పెట్టించుకున్న...

అడిగి మరి తన సినిమా లో ఆ హీరోయిన్ ని పెట్టించుకున్న బాలయ్య .. ఆమె ఎంత స్పెషల్ అంటే..?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడి.. నిజాయితీగా నటించే నటులు చాలా తక్కువ. వాళ్ళల్లో ఒకరే నందమూరి నటసింహం బాలయ్య. ఏదైనా సరే ఓపెన్ గా చెప్పేయడం బాలయ్యకు మొదటి నుంచి అలవాటు . తప్పు చేస్తే చంప పగలగొట్టే చేతులే.. మంచి పనులు చేస్తే శభాష్ అంటూ భుజం తడుతుంది . అవసరమైతే హెల్ప్ చేస్తుంది. అంతటి నిర్మలమైన మనసు గల బాలయ్య అంటే జనాలకు విపరీతమైన ఇష్టం .

అఫ్ కోర్స్ బాలయ్య కోపానికి భయపడే జనాలు ఉన్నారు . కానీ బాలయ్య ప్రేమను అభిమానించే ఫ్యాన్స్ వాళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నారు. కాగా ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తన 107వ సినిమాను బిజీ బిజీగా షెడ్యూల్ చేసుకున్న బాలయ్య ..ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఎలాంటి టాక్ ను దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . పాట విన్న ప్రతి ఒక్కరికి పూనకాలు వచ్చేస్తున్నాయి. ఆ లిరిక్స్ బాలయ్య కు పర్ఫెక్ట్ అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ సినిమా పూర్తవగానే నందమూరి బాలయ్య బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకు కమిటీ అయ్యాడు . ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు అనిల్ రావిపూడి. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .

కాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మరో సీనియర్ బ్యూటీని ట్రై చేస్తున్నారని ..ఆ పాత్ర విన్న మరోక్షణం బాలయ్యకు స్టార్ హీరోయిన్ బ్యూటీ స్నేహ గుర్తు వచ్చిందని.. ప్రత్యేకించి ఈ పాత్రకు ఆమె పేరును సజెస్ట్ చేశారని ఓ న్యూస్ ఫైనల్ గా మారింది . మొదటి నుంచి బాలయ్యకు స్నేహ అంటే చాలా ఇష్టమట . హోంలీ పాత్రలు చేస్తూ చాలా చక్కగా ఉంటుందని చెప్పుకొచ్చేవారట. ఈ క్రమంలోనే ఆ పాత్ర వినగానే స్నేహ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ ఆమెను ఈ సినిమాలో పెట్టమంటూ డైరెక్టర్ అనిల్ కు సలహా ఇచ్చారట. ఇప్పటికే అనిల్ రావిపూడి స్నేహను అప్రోచ్ అయినట్టు.. కధ విన్న ఆమె ఓకే చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే బాలయ్య ఇష్టంగా పెట్టుకున్న హీరోయిన్స్ స్నేహ ఈ పాత్రకు న్యాయం చేయగలిగితే ..బాలయ్య తన నెక్స్ట్ సినిమాలో సైతం అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లు ఉన్నాయి అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news