Moviesకూతురు పెళ్లిలో ఏ తండ్రి చేయని పని చేసిన అలీ ..వీడియో...

కూతురు పెళ్లిలో ఏ తండ్రి చేయని పని చేసిన అలీ ..వీడియో వైరల్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న అలీ అంటే జనాలకు కూడా అదో ప్రత్యేకమైన గౌరవం. అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూ వల్గర్ డైలాగ్స్ చెప్తాడనే కానీ ..అలీ మనస్సు చాలా మంచిదని ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాడని జనాలు చెప్పుకొస్తారు .

కాగా నిన్ననే ఆయన పెద్ద కూతురు ఫాతిమా వివాహం గ్రాండ్ గా హైదరబాదులో జరిగింది . ఇప్పటికే తన కూతురు నిశ్చితార్థం వీడియోతో బాగా పాపులర్ అయిపోయిన అలీ భార్య జుబేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది . మరీ ముఖ్యంగా ఆలీకి మించిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది జుబేదా అనడంలో సందేహం లేదు. చాలా సైలెంట్ గా డీసెంట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ.. ఒరిజినల్ రివ్యూస్ ఇస్తూ యుట్యూబ్లో జుబేదా మంచి పేరు సంపాదించుకుంది . అంతేకాదు కూతురు పెళ్లి కోసం చేసిన షాపింగ్, నగల డీటెయిల్స్ అన్నీ కూడా జనాలకు క్లియర్గా వివరించింది.

కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో గ్రాండ్గా జరిగిన అలీ-జుబేదల కూతురు ఫాతిమా వివాహానికి మెగాస్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున సతీసమేతంగా వచ్చి నూతన జంటను ఆశీర్వదించడం హైలైట్ గా మారింది . అంతేకాదు సీనియర్ హీరోయిన్ రోజా కూడా అలీ కూతురు పెళ్లికి వచ్చి ఆశీర్వదించింది. దీంతో అలీ ,నాగార్జున , రోజా కలిసి మరింత సందడి చేశారు . కాగా కూతురు పెళ్లిలో అలీ చేసిన బిహేవియర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .

ఎవరైనా సరే కూతురు పెళ్లి అంటే కూసింత ఎమోషనల్ అవుతారు. అమ్మగారి ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్లి పోతుంది అక్కడ ఎలా ఉంటుందో అని బాధపడతారు ..అయితే ఆలీ మాత్రం అటువంటివి ఏవీ లేకుండా ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపడుతూ చాలా నవ్వుతూ సరదాగా ఉన్నారు. అసలు కూతురు మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందన్న బాధ ముఖంలో కనిపించలేదు. ఇంకొక పుట్టింటికి వెళ్తున్నంత సంతోషంగా ఆలీ ప్రవర్తించిన తీరు జనాలకు ఆశ్చర్యంగా అనిపించింది . అంతేకాదు ప్రతి పనిని ఆలీ దగ్గరుండి చూసుకోవడం స్టార్స్ కి సైతం షాకింగ్ అనిపించింది . పెళ్లి అంటే ఎన్ని హడావిడిలు ఉంటాయో తెలిసిందే.. ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ కి న్యాయం చేస్తూనే .. మరోవైపు పర్సనల్ లైఫ్ ని కూడా హ్యాండిల్ చేయడం చాలా కష్టం . అందులో అలీ సూపర్ సక్సెస్ అయ్యాడు . ప్రస్తుతానికి అలీ జుబేదాల కూతురు ఫాతిమా వివాహ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news