Moviesఎన్టీఆర్ - కొర‌టాల సినిమా... ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఫిక్స్ అయ్యారోచ్‌...!

ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా… ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఫిక్స్ అయ్యారోచ్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలు ఎక్కుతుందా ? అని టాలీవుడ్ సినీ అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరేడు నెల‌లుగా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి కూడా ఆరేడు నెల‌లు అవుతోంది. ఇప్ప‌ట‌కీ కొర‌టాల సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు.

ఆచార్య డిజాస్ట‌ర్ కావ‌డంతో కొర‌టాల కూడా ఎన్టీఆర్ సినిమా క‌థ విష‌యంలో చాలా క‌స‌ర‌త్తులే చేస్తున్నాడు. అందుకే ఏదీ ఓ ప‌ట్టాన ముందుకు వెళ్ల‌డం లేద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా క‌థలో మార్పులు, చేర్పులు న‌డుస్తూనే ఉన్నాయి. ఇక హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది కూడా తేల‌డం లేదు. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా న‌టించే ఇద్ద‌రు హీరోయిన్ల‌ను కూడా దాదాపు ఫైన‌ల్ చేసేశార‌ని అంటున్నారు.

మెయిన్ హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు ఖ‌రారైంది. ఆమెను తెలుగులోకి తీసుకు వ‌చ్చింది కూడా కొర‌టాల‌నే. మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాలో ఆమె న‌టించింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత కియారా తెలుగులోనే రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా విన‌య‌విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు చెర్రీ – శంక‌ర్ సినిమాలోనూ ఆమే హీరోయిన్‌.

ఇక ఇప్పుడు ఆమెను ఎన్టీఆర్‌కు జోడీగా కొర‌టాల ఫిక్స్ చేశాడ‌ట‌. కియారా ఈ ప్రాజెక్టులోకి వ‌స్తే పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాకు మ‌రింత క్రేజ్ ఖాయం. ఇక రెండో హీరోయిన్‌గా యంగ్ హీరోయిన్ శ్రీలీల‌ను ఫైన‌ల్ చేసేశార‌ట‌. శ్రీలీల‌కు ఇప్పుడు మామూలు క్రేజ్ రాలేదు. ఎన్టీఆర్ – శ్రీలీల కాంబో అంటే మామూలు క్రేజ్ ఉండ‌దు. ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల ప‌క్క‌న ఎన్టీఆర్‌ను చూడ‌డం ఫ్యాన్స్‌కు పిచ్చ కేకే.

ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ త‌న మేకోవ‌ర్ కూడా పూర్తిగా మార్చుకుంటున్నాడు. ఇప్ప‌టికే 9 కిలోల బ‌రువు కూడా త‌గ్గాడు. క‌స‌ర‌త్తులు కూడా బాగా చేస్తున్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గ‌తంలో కొర‌టాల – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news