Moviesకేకపెట్టించే అప్డేట్: 12ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం అలా.. ఇక మహేశ్...

కేకపెట్టించే అప్డేట్: 12ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం అలా.. ఇక మహేశ్ అభిమానులను పట్టలేం రా బాబోయ్..!!

“అబ్బబ్బ ఈ న్యూస్ అదిరిపోయింది . ఇక చూడు మొత్తం రచ్చ రంబోలా”.. ఎస్ ప్రజెంట్ మహేష్ బాబు అభిమానుల పొజిషన్ ఇలానే ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .నమ్మిన కథను నమ్మకంగా నటించి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే టాలీవుడ్ స్టార్ హీరో. రీసెంట్గా “సర్కారి వారి పాట ” అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న మహేష్ ..ప్రజెంట్ త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు ssmb28 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ షూరు చేశారు.

 

కాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి అతడు మరొకటి ఖలేజా. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. 12 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా చేస్తుండడం సినీ ఇండస్ట్రీలోనే ఓ బిగ్ సంచలనంగా మారింది. అంతేకాదు “అతడు, ఖలేజా” సినిమాలకు మించి ఈ సినిమా ఉండబోతుంది అంటూ చిత్ర బృందం చెప్పుకొస్తుంది.కాగా మహేష్ 28వ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని ఆ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ అందాల బొమ్మను వెతికే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది .

అంతేకాదు మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నాక సినిమాకు సంబంధించిన రెండో హీరోయిన్ ని అఫీషియల్ గా ప్రకటన చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఫుల్ యాక్షన్ సీన్స్ కామెడీ మొత్తం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమా నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా అతడు , ఖలేజాలను మించి పోతుందని ఖ్చ్చితంగా మహేష్ బాబు కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

“అంతేకాదు ఇది ఓ డిఫరెంట్ స్టోరీ అని ..ఇప్పటై వరకు ఎవ్వరు తెర పై చూడని స్టోరీ అని “చెప్పుకొచ్చారు. అంతేకాకుండా..ఈ సినిమాలో అదిరిపోయే మాస్ ఐటమ్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశారని అభిమానులకు పూనకాళ్లు తెప్పించే న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు మహేష్ నటించిన సినిమాలలో మాస్ ఐటమ్ సాంగ్ ఎక్కడా కూడా లేదని ..దీంతో ఈ సినిమా నుండే తన సినిమాలో ఐటం సాంగ్ పెట్టుకునేలా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి పాటలు కూడా ఓ ప్లస్ పాయింట్ అవుతుందనే టాక్ బయటకు వచ్చింది. దీంతో మహేష్ సినిమాలో మాస్ ఐటమ్ సాంగ్ ఉంటుంది అని అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. మహేష్ ను మాస్ ఐటెం సాంగ్ లో చూడడం కోసం అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news