Moviesరెండు లక్షల విలువ చేసే షూ కోసం షూటింగ్ ఆపేసి ర‌చ్చ...

రెండు లక్షల విలువ చేసే షూ కోసం షూటింగ్ ఆపేసి ర‌చ్చ చేసిన‌ ఆశిన్ ..!

2001లో మలయాళ సినిమా పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆశిన్ తెలుగులో మాత్రం అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా తో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ ఫుల్ గా దాదాపు ఒక దశాబ్దానికి పైగా హీరోయిన్ గా నటించింది. కెరియర్ ఎంతో పీక్ లో ఉన్న సమయంలోనే ఆమె సినిమా పరిశ్రమ కు గుడ్ బై చెప్పి సామ్ సంగ్ అధినేత అయిన రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఒక పుత్రిక కూడా ఉంది.

ఆమె వ్యక్తి గత జీవితం అంతా బాగానే ఉన్న ఆమె సినిమా జీవితం మాత్రం ఎన్నో వివాదాలకు కారణమైంది. 2015, 2016 వరకు సినిమాలతో బిజీగా ఉన్న ఆశిన్ కెరియర్ లో ఎన్నో కాంట్రవర్సీలకు సెంట్రల్ అట్రాక్షన్ అయింది. మరీ ముఖ్యంగా తన తోటి నటీనటులతో కూడా సఖ్యత లేకపోవడం తో ఆశిన్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. హిందీ గజిని సినిమా షూటింగ్ సమయంలో జియాఖాన్ తో ఆమెకు ఎంతో పెద్ద వివాదమే నడిచింది.

ఒకసారి సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత సౌత్ సినిమా పరిశ్రమలను ఆమె ఎంతో చిన్నచూపు చూసింది అనే వాదన కూడా ఉంది. అసలు సౌత్ నుంచి ఎవరైనా డైరెక్టర్ ఆమెను అప్రోచ్ అవ్వాలన్నా కూడా అందుకు ఆమె ఒప్పుకోలేద‌న్న వార్త‌ల‌తో… ఆమెను పూర్తిగా సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలు దాదాపుగా బ్యాన్ చేసేసాయి. కానీ ఈ వార్తలను ఆశిన్ ఖండించినప్పటికీ ఆమె ఒకసారి హిందీకి వెళ్ళిన తర్వాత ఏ సౌత్‌ భాషలో నటించలేదు.

ఇక ఒక హిందీ సినిమా షూటింగ్ కోసం పారిస్ కి వెళ్ళిన సందర్భంలో కూడా జరిగిన ఓ సంఘటన ఆ తర్వాత పెద్ద దుమారమే లేపింది. ఒక సాంగ్ షూట్ కోసం పారిస్ లో చిత్ర బృందం పర్యటిస్తున్న సమయంలో ఆమె వేసుకున్న షూ ఆమెకు సౌకర్యంగా లేకపోవడంతో ఏకంగా ఆ సినిమా షూటింగ్ ఆపేసింది ఆశిన్. ఈ ఒక్క సీన్‌కు ఎడ్జెస్ట్ చేసుకోవాల‌ని… మధ్యాహ్నం లోపు మళ్ళీ కొత్త షూలు ఇస్తానని దర్శకుడు చెప్పినా కూడా ఆశిన్ వినలేదు.

చేసేదేమీ లేక యూనిట్లో ఒక వ్యక్తిని ఇచ్చి ఆశిన్‌తో షాపింగ్ పంపించారు సినిమా దర్శకుడు. అక్కడికి వెళ్లిన ఆశిన్ దాదాపు రెండు లక్షల ఖరీదైన షూలు కొనుగోలు చేసి షూటింగ్ లో పాల్గొంది. అలా అంత ఖరీదైన షూలు కొనడం అప్పట్లో వివాదానికి తెర లేపింది. కేవలం అంత ఖరీదైన షూల కోసమే షూటింగ్ ఆపింది అనే కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై సదరు దర్శకుడుని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని కొట్టిపారేశాడు.

ఇక ఆశిన్ కూడా ఈ వివాదం పై స్పందించింది. తాను అవసరముంది కాబట్టే కొన్నానని అందులో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్నించింది. అశిన్ లాగా ప్రతి ఒక్క నటి కూడా ప్రవర్తిస్తే ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటేనే భయపడే స్థాయికి వెళతాడని.. అశిన్ ప్రవర్తన మార్చుకుంటేనే మంచిదని అప్పట్లో అనేక వ్యాఖ్యలు వినిపించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news