Moviesస‌న్నీలియోన్‌కు మంచు విష్ణు ఘాటు లిప్ కిస్‌... జిన్నా టీజ‌ర్లో ర‌చ్చ...

స‌న్నీలియోన్‌కు మంచు విష్ణు ఘాటు లిప్ కిస్‌… జిన్నా టీజ‌ర్లో ర‌చ్చ ( వీడియో)

మా అధ్య‌క్షుడిగా బిజీగా ఉన్న మంచు విష్ణు ఇటు వ‌రుస‌గా సినిమాలు కూడా చేసుకుంటూ వెళుతున్నారు. మోస‌గాళ్లు త‌ర్వాత కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్న విష్ణు ప్ర‌స్తుతం జిన్నా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్‌తోనే కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసిన విష్ణు జిన్నా నుంచి తాజాగా టీజ‌ర్ వ‌చ్చింది. ఈ సినిమాను కూడా విష్ణు సొంత బ్యాన‌ర్లోనే తెర‌కెక్కించాడు.

జిన్నాలో విష్ణు సరసన ఇద్దరు బ్యూటీలు పాయల్‌ రాజ్‌పుత్ – సన్నీలియోన్ న‌టిస్తున్నాడు. టీజ‌ర్లో మంచు విష్ణుకు స‌న్నీలియోన్ లిప్‌కిస్ ఇచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. ఏదేమైనా సినిమాలో ఫ‌స్టాఫ్ అంతా కావాల్సినంత కామెడీతో పాటు ఇద్ద‌రు హీరోయిన్ల‌తో రొమాన్స్‌కు తోడు సెకండాఫ్‌లో హ‌ర్ర‌ర్ కూడా మిక్స్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

సినిమాలో కామెడీతో పాటు రొమాంటిక్ యాంగిల్‌కు కొద‌వ లేద‌నే తెలుస్తోంది. ఇక స‌న్నీలియోన్ కూడా ఉండ‌డంతో కుర్రోళ్ల ర‌చ్చ‌కు అంతే ఉండ‌ద‌నుకోవ‌చ్చు. ఇక ఊరి నిండా అప్పులు చేసి టెంట్ హౌస్ న‌డుపుకునే కుర్రాడిగా విష్ణు న‌టిస్తున్నాడు. జిన్నా టీజ‌ర్ చూస్తుంటే చాలా రోజుల త‌ర్వాత విష్ణుకు దేనికైనా రెడీ, దూసుకెళ్తా రేంజ్‌లో మంచి హిట్ పడేలా ఉంది. తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news