Moviesఒక్కే దుప్పట్లో దూరి "జింతాత జిత జిత"..బిగ్ బాస్ లో ఈ...

ఒక్కే దుప్పట్లో దూరి “జింతాత జిత జిత”..బిగ్ బాస్ లో ఈ దరిద్రపు రొమాన్స్ లు చూడలేం రా బాబోయ్..!!

బిగ్ బాస్ ..ఈ పేరు చెప్తే నవ్వుకునే జనాలు ఎంతమంది ఉన్నారో తెలియదు ..కానీ, తిట్టుకునే జనాలు మాత్రం బోలెడు మంది ఉన్నారు. ఈ మధ్య పబ్లిక్ గానే తిట్టేస్తున్నారు. మనకు తెలిసిందే బిగ్ బాస్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది సిపిఐ నారాయణ. ఆయన బిగ్ బాస్ పై మండిపడుతూనే ఉంటాడు. రీసెంట్గా బిగ్ బాస్ 6 స్టార్ట్ అవుతున్న క్రమంలో కూడా హోస్ట్ నాగార్జున పై దారుణ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో జరుగుతున్న సంఘటనలు చూసి బయట ఉన్న కంటెస్టెంట్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ బిగ్ బాస్ సీజన్స్ ని బాగా ఫాలో అయినట్టున్నారు.

ఎవరితో కనెక్ట్ అయితే హౌస్ లో ఎక్కువకాలం ఉంటాము.. ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తే బిగ్ బాస్ మనల్ని ఎలిమినేట్ చేయడు అని గ్రహించి.. ముందుగానే అలాంటి కంటెంట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ ఎపిసోడ్ లో శ్రీహాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారాయి. రీసెంట్ ఎపిసోడ్లో చిలిపి సంఘటన గురించి శ్రీహాన్ చెబుతూ .. “నేను ప్రతిరోజు నిద్రలేచి చూసుకునేసరికి నా మడ పై ఓ మార్క్ ఉంటుంది సార్. నా పక్కన అర్జున్ వచ్చినప్పటి నుంచి ఇలానే జరుగుతుంది అంటూ నాగార్జునతో చెప్పాడు. దీంతో వెంటనే ఆరోహి అందుకుంటూ ..”ఒకే దుప్పట్లో ముగ్గురేసి పడుకుంటారు సార్ ఏం చేస్తారో తెలియదు.. ఆ కారణంగా ఒంటిపై మార్కులు ఉన్నాయి అనుకుంటాను” అంటూ వల్గర్ కామెంట్స్ చేసింది.

దీంతో ముగ్గురు మగాళ్ళు ఒకే దుప్పట్లో పడుకుంటున్నారని ఆరోహి చెప్పిన మాటలను మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్. అంతేకాదు శ్రీహాన్ బ్యాచ్ పై ఆరోహి కామెంట్స్ కి నాగార్జున, గెస్ట్ గా వచ్చిన తమన్నా షాక్ అయిపోయారు. ముగ్గురు అబ్బాయిలు ఒక్కే మ్మచం మీద ఒక్కే దుప్పట్లో ఇంకేముంది “జింతాత జిత జిత” కదా అంటూ మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు జనాలు. మరోపక్క ఏంటి రా ఈ వల్గర్ మాటలు బిగ్ బాస్ అందరూ చూస్తున్నారు కదా ఇలాంటి మాటలు ఏంటి అంటూ తిడుతున్నారు. మరి కొందరు “ఇది బిగ్ బాస్ షో నా ..బూతు షో నా.. ఏంటిది ..?”అంటూ ఫైర్ అవుతున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే.. ఇలాంటివి జరిగితే బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ పెరుగుతుందట . మరి చూడాలి నెక్స్ట్ వారం ఎలాంటి ఘాటు మాటలు వినాల్సి వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news