Moviesరాజమౌళితో ఒక్కసారైన అలా చేయాలి..చచ్చిపోవడానికి కూడా రెడీ ..హీరోయిన్ హాట్ కామెంట్స్...

రాజమౌళితో ఒక్కసారైన అలా చేయాలి..చచ్చిపోవడానికి కూడా రెడీ ..హీరోయిన్ హాట్ కామెంట్స్ కు షాక్ అవుతున్న సినీ పెద్దలు..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు..హీరోలను పొగడడం సర్వసాధారణం. ఎలాంటి హీరోయిన్ అయినా సరే తనతో పని చేసే కో వర్కర్.. స్టార్ హీరోని పొగడాల్సిందే. అతనితో కెమిస్ట్రీ బాగున్న అతని బిహేవియర్ బాగా లేకపోయినా సరే మీడియా ముందు మాత్రం ఈ స్టార్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఈ స్టార్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ జన్మలో మర్చిపోలేని నీతి వ్యాఖ్యలు చెబుతూ ఉంటారు.

కాగా ఆ లిస్టులోకే యాడ్ అయింది నాగిని సీరియల్ ఫేమ్ మౌనిక రాయ్. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . నాగిని సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయింది . అంతేకాదు తన హాట్ అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలకు రుచి చూపిస్తూ ..టాప్ ట్రెండింగ్ లో ఉంటూ తన పేరును అందరికీ తెలిసేలా చేసుకుంది . అంతేనా రీసెంట్ గా వచ్చిన బ్రహ్మస్త్ర సినిమాలో కూడా నెగిటివ్ రోల్ పోషించి రణబీర్ ఆలియా కు ఏ మాత్రం తీసుపోని విధంగా మార్కులు వేయించుకుంది.

దీంతో మౌని రాయ్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే ఆమె రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “దర్శకధీరుడు రాజమౌళి అంటే తనకు ఇష్టమని.. ఆయన డైరెక్షన్లో ఒక్కసారైనా సినిమా చేయాలని ..ఆ అవకాశం కోసం చచ్చిపోతున్నానని “పబ్లిక్ గా చెప్పి షాక్ ఇచ్చింది . నిజానికి ఏ హీరోయిన్ అయినా సరే సినిమాలో అవకాశాల కోసం ఇలానే కాక పడుతుంది . కానీ ఈమె డైరెక్టుగా దర్శకధీరుడికి టెండర్ వేసినట్లు కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రణబీర్ ఆలీయా ని పక్కనపెట్టి నాగార్జున గారిని ఎక్కువగా పోగడటం.. నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఉంది అని చెప్పడం.. మొత్తంగా అమ్మడు మాటలు చూస్తుంటే బాలీవుడ్ కన్నా టాలీవుడ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి హాట్ బ్యూటీ హీటెక్కించే కామెంట్స్ పై రాజమౌళి ఎలా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news