Moviesటాప్ 10 పాన్ ఇండియా హీరోల లిస్ట్ ఇదే.. ఫస్ట్ ప్లేస్...

టాప్ 10 పాన్ ఇండియా హీరోల లిస్ట్ ఇదే.. ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారో తెలుసా.. ప్రభాస్ కాదు..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారు మ్రోగిపోతుంది . ఏ హీరో కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్లు కానీ.. అందరూ కూడా ప్రతి స్టార్ పాన్ ఇండియా సినిమాల్లోనే నటించాలని కోరుకుంటున్నాడు .ఒక భాషలో నటిస్తే ఆ భాషకే పరిమితం అవుతాం. పాన్ ఇండియా సినిమా అయితే ఒకే సినిమాతో ఐదు భాషల్లో పాపులారిటీ దక్కించుకోవచ్చు. తద్వారా క్రేజ్ రెమ్యూనరేషన్ రెండూ పెరుగుతాయి .ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ బిగ్ స్టార్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తమ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పాన్ ఇండియా అనగానే మనకి మొదట గుర్తొచ్చే పేరు ప్రభాస్ . ప్రభాస్ తోనే ఈ పాన్ ఇండియా అనే పదం పాపులర్ అయింది అని జనాల భావన. కాగా రీసెంట్గా ఈ జనరేషన్ స్టార్స్ లో టాప్ టెన్ పాన్ ఇండియా హీరోస్ ఎవరు అంటూ ఇంట్రెస్టింగ్ సర్వే నిర్వహించింది బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్. ప్రతి నెలా ఇలాంటి సర్వే ఒకటి నిర్వహిస్తుంది. ఈ సంస్థ సర్వే ప్రకారం ఆగస్టు 2022 కు గాను నెంబర్ వన్ పాన్ ఇండియా హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.

వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం. ఎస్ అందరూ పాన్ ఇండియా హీరో అనగానే ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు అనుకుంటారు. కానీ ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకుండా కూడా విజయ్ ఇలాంటి ఘనత సాధించడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఆయన అభిమానులు. అంతేకాదు విజయ్ తర్వాత ప్లేస్ లో ప్రభాస్ రెండో పాన్ ఇండియా హీరోగా పాపులారిటి దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాతి స్థానంలో ఎన్టీఆర్.. టాప్ త్రీ ప్లేసును దక్కించుకున్నాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఆ తర్వాత స్థానంలో బన్నీ.. ఆ తర్వాతి స్థానంలో యాష్ నాలుగు ఐదు స్థానాలతో సరి పెట్టుకున్నారు. టాప్ టెన్ లో ఉన్న మన హీరోలను గమనిస్తే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆరవ ర్యాంక్, రామ్ చరణ్ 7 ,మహేష్ బాబు 8, సూర్య 9, అజిత్ 10 ర్యాంకులతో సరిపెట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news