Moviesఈ వయసులో అలాంటి కోరిక తీర్చుకున్న యాంకర్ శ్యామల..వీడియో వైరల్..!!

ఈ వయసులో అలాంటి కోరిక తీర్చుకున్న యాంకర్ శ్యామల..వీడియో వైరల్..!!

ప్రతి ఆడపిల్లకి కొన్ని కోరికలు ఉంటాయి . చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో తిరగాలని, అమ్మ చీర కట్టుకోవాలని ..నాన్న బండిలో ముందు కూర్చొని వెళ్లాలని.. అన్నతో గొడవ పడాలని.. అక్క డ్రస్సులు లాక్కోవాలని ..ఇలా చిన్న వయసులో చాలా సరదా కోరికలు ఉంటాయి. ఇక వయసు వచ్చాక తన కాబోయే భర్త గురించి పెళ్లయ్యాక ఉండాల్సిన తీరు గురించి కలలు కంటూ ఉంటుంది. తన పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని ఏ ఆడపిల్ల కైనా ఉంటుంది కానీ ఆ సమయానుసారం వాళ్లకు తగ్గ స్తోమత విధంగా జనాలు నడుచుకుంటూ ఉంటారు.

అయితే తన కోరిక తీరకుండా అలాగే మిగిలిపోయి ఉంటే ..ఆ కోరిక తీర్చుకునే టైమ్ సడెన్ గా ఎంటర్ అయితే ..ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది . ఆకాశంలో ఎగిరిపోతున్నట్లు ఉండదు. ప్రజెంట్ అలాంటి= ఎంజాయ్మెంట్ అనుభవిస్తుంది యాంకర్ శ్యామల. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ అవుదామని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె బుల్లితెరలోనే సెటిల్ అయిపోయింది. హీరోయిన్ కి మించిన అందం ఉన్న యాంకర్ శ్యామల ఎందుకు హీరోయిన్ అవ్వలేకపోయిందో మాత్రం అర్థం కావడం లేదు . సినిమాలో వదిన రోల్స్ హీరోయిన్ అక్కరోల్స్ చేస్తుంది కానీ హీరోయిన్ గా మాత్రం చేయట్లేదు. అవకాశాలు రావట్లేదు. దానికి కారణాలు ఏవైనా ..బుల్లితెరపై మాత్రం యాంకర్ శ్యామల ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

ఓవైపు యాంకరింగ్ చేస్తూ మరోవైపు బుల్లితెర ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్యామల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత మరింత ఫేమస్ అయింది. అంతేకాదు బిగ్ బాస్ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని జనాలకు మరింత దగ్గర అయింది. అయితే ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల తన చిరకాల కోరికను తీర్చుకున్నట్లు ఇంస్టాగ్రామ్ పోస్ట్లో చెప్పుకొచ్చింది. ఆమె సీరియల్ యాక్టర్ నరసింహను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళ పెళ్లి చాలా సాదాసీదాగా సాగిపోయింది . కానీ ఆమెకు పెళ్లిలో పల్లకిలో రావాలనే కోరిక అలాగే ఉండిపోయిందట . ఇక ఈవెంట్ లో భాగంగా ఆమెకు ఆ కోరిక నెరవేరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్యామల పల్లకిలో ఊరేగుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో యాంకర్ శ్యామల పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. మరి చూడాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను యాంకర్ శ్యామల ఎప్పుడు చెబుతుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Are Syamala (@syamalaofficial)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news