Moviesపొన్నియన్ సెల్వన్ సినిమా కోసం అలాంటి పని చేసిన ఐశ్వర్య రాయ్..హర్ట్...

పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం అలాంటి పని చేసిన ఐశ్వర్య రాయ్..హర్ట్ అయిన అభిషేక్..!?

కోట్లాదిమంది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరణం మరి కొద్ది గంటల్లో రాబోతుంది. కనీ విని ఎరుగని రేంజ్ లో స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమా పోనియన్ సెల్వన్ .ఈ సినిమా రెండు భాగాలుగా తరికెక్కిస్తామని మణిరత్నం ముందుగానే చెప్పాడు. ఈ క్రమంలోనే పోలియన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 30 విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి అన్ని పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధం చేశాడు మణిరత్నం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మరి కొద్ది గంటల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది.

అంతేకాదు దీనికి తమిళనాడు జనాలు తమిళనాడు బాహుబలి అంటూ ఓ రేంజ్ హైప్ ఇచ్చారు . తెల్లవారుజామున నాలుగు గంటల షోలుకి టికెట్లు హాట్ కేక్కుల్లా అమ్ముడు అయిపోతున్నాయి. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన చాలు మణిరత్నం ఈసారి ఓ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తాడు అని చెప్పేయొచ్చు. మనకు తెలిసిందే మణిరత్నం హిట్ కొట్టి చాలా ఏళ్లవుతుంది సినిమా డైరెక్షన్ పరంగా బాగున్న కలెక్షన్ పరంగా సినిమా చాలా వెనుకంజలో ఉంది . అయితే తన ఆశలన్నీ మణిరత్నం ఈ సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు.

అంతేకాదు ఈ సినిమాను భారీ తారగాణంతో తెరకెక్కించాడు మణిరత్నం. విక్రమ్, జయం రవి , కార్తీ , ఐశ్వర్యారాయ్.. త్రిష లాంటి బిగ్ స్టార్స్ ఈ సినిమాలో పెట్టి దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కోసం అందాల భామ ఐశ్వర్యారాయ్ సపరేట్ డైట్ ను ఫాలో అయిందట. ఏమాత్రం నీచు పదార్థం తినకుండా పూర్తి శాఖాహారంతోనే ఐశ్వర్యరాయ్ దాదాపు 8 నెలలు గడిపినట్లు తెలుస్తుంది. ఆమె పాత్ర కోసం ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకొని దానికి తగ్గ వ్యాయామాలు చేసినట్లు.. ఆ మడి ఆచారాలను ఫాలో అయినట్లు ఓ న్యూస్ బాలీవుడ్ లో వైరల్ గా మారింది . ఐశ్వర్యరాయ్ మంచి ఫుడీ నచ్చిన ఫుడ్స్ ఇష్టంగా తింటుందట . కానీ ఇలా నోరు కట్టేసుకొని ఐశ్వర్యరాయ్ ప్లేట్ చూసిన అభిషేక్ చాలా టైమ్స్ లో బాధపడ్డారట . అంతేకాదు సినిమా క్యాస్ట్ అండ్ క్రీవ్ లో మొత్తంగా అందరికన్నా ఎక్కువ పారితోషకం తీసుకున్న హీరోయిన్ కూడా ఐశ్వర్య రాయ్ నే. దాదాపు అమ్మడు ఈ సినిమా కోసం 15 కోట్లు చార్జ్ చేసినట్లు తెలుస్తుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news