Moviesరామ్ చరణ్ ని బాధ పెట్టిన హీరోయిన్..వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..!? డైరెక్టర్...

రామ్ చరణ్ ని బాధ పెట్టిన హీరోయిన్..వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..!? డైరెక్టర్ దాచిన సీక్రేట్ స్టోరీ ఇదే ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..మెగాస్టార్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత టాలెంట్ తోనే మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్నాడు . మనకు తెలిసిందే రాంచరణ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా యావరేజ్ గానే పడింది. ఈ సినిమాలో చరణ్ నటన కూడా అంతంత మాత్రమే అంటూ సినీ ప్రముఖులు కూడా తేల్చేశారు. కొందరైతే రామ్ చరణ్ ను దారుణంగా ట్రోల్ చేశారు . అసలు “నీ మొఖానికి నువ్వు మెగా హీరోనా ” అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.


అయితే వాటన్నింటిని తిప్పికొడుతూ తన రెండో సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా..కాదు కాదు ..ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసే విధంగా స్టన్నింగ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసాడు ఈ మెగా వారసుడు , ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా అంటే పడి చచ్చిపోయే జనాలు ఉన్నారు, ఆ గ్రాఫిక్స్ ..సినిమాలో చరణ్ పెర్ఫార్మెన్స్ ..కాజల్ అందాలు.. ఇప్పటికీ సినిమా డైలాగ్స్ మన లైఫ్ స్టైల్ లో వాడుతూనే ఉన్నాం. అంతలా ఈ సినిమా జనాలకు నచ్చేసింది.


ఇక మగధీర సినిమా నుంచి రామ్ చరణ్ తన కెరీర్ ని వెనక్కి చూసుకునే పని లేకుండా పోయింది. చాలా సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. కొన్ని సినిమాల సక్సెస్ అయ్యాయి. కానీ సినిమా ఫ్లాప్ అయినా కూడా రామ్ చరణ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే, ఈ సినిమా టైంలో రాం చరణ్ ని తన బీహేవీయర్ తో కాజల్ విసుకు తెప్పించిందట.

షూటింగ్ స్పాట్ కు టైం కు వచ్చేది కాదు అని..షాట్ రెడీ అయినా ఆలస్య చేసేదని..దీంతో రాజమౌళి కూడా..కాజల్ బీహేవియర్ తో విసుకు చెందాడాని అప్పట్లో టాక్ వినిపించింది. ఓ ఇంటర్వ్యులో చరణ్ సైతం ఇదే విషయాని..చెప్పేశాడు..కానీ, ఆ తరువాత జస్ట్ జోకింగ్ అంటూ కవర్ చేసుకొచ్చాడు. ఈ విషయంలో కాజల్ కి చిరు కూడా వార్నింగ్ ఇచ్చారట. ప్రజెంట్ కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది. మంచి స్టోరీ దొరికితే..సినిమాలు చేయడానికి రెడీ అంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news