Moviesఅవ‌కాశాల పేరుతో హోట‌ల్‌కు పిలిచి... ఆ డైరెక్ట‌ర్ గుట్టు ర‌ట్టు చేసిన...

అవ‌కాశాల పేరుతో హోట‌ల్‌కు పిలిచి… ఆ డైరెక్ట‌ర్ గుట్టు ర‌ట్టు చేసిన ర‌వితేజ హీరోయిన్‌..!

ఇటీవ‌ల కాలంలో సినిమా ఇండస్ట్రీ ఏదైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అన్న‌ది కామ‌న్ అయిపోయింది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా.. .అది కేవ‌లం నాలుగు గోడల మధ్యనే ఉండేది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. మీ టు ఉద్య‌మాలు రావ‌డంతో ఎవ్వ‌రూ కూడా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. రాధికా ఆఫ్టే లాంటి బోల్డ్ హీరోయిన్ నుంచి విద్యాబాల‌న్ లాంటి క్రేజీ హీరోయిన్‌, కంగ‌నా ర‌నౌత్ లాంటి ఫైర్‌బ్రాండ్లు, చిన్మ‌యి లాంటి సింగ‌ర్లు, చిన్నా చిత‌కా హీరోయిన్లు అంద‌రూ కూడా కాస్టింగ్ కౌచ్‌పై ఓపెన్ అయిపోతూ తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల‌ను చెపుతున్నారు.

విచిత్రం ఏంటంటే సీనియ‌ర్ హీరోయిన్లు కూడా త‌మ జీవితంలో గ‌తంలో ఎదురైన వేధింపులు ఇప్పుడు బ‌య‌ట పెడుతున్నారు. సీనియ‌ర్ హీరోయిన్ క‌స్తూరీయే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇక ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద ఉద్య‌మ‌మే అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా తెలుగులో మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ హీరోగా నటించిన రామారావు సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన అన్వేషి జైన్ కూడా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యింది.

తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ప‌లు సంఘ‌ట‌న‌లు ఎదుర్కొన్నాన‌ని.. ముందు మోడ‌లింగ్‌లో ప‌నిచేసి ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని చెప్పింది. తాను సినిమా ఆడిష‌న్స్‌కు వెళితే కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌న‌పై అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు చేయ‌డంతో పాటు నానా విధాలా ఇబ్బందులు పెట్టార‌ని వాపోయింది. ఓ సారి సినిమా ఆఫ‌ర్ ఉంద‌ని ఓ స్టార్ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళితే.. ఆఫ‌ర్ పేరుతో త‌న శ‌రీరంపై అస‌భ్య‌క‌రంగా ట‌చ్ చేయ‌డంతో పాటు చాలా నీచంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని.. అయితే త‌న‌కు మ్యాట‌ర్ అర్థ‌మై తాను అక్క‌డ నుంచి వెళ్లిపోయాన‌ని చెప్పింది.

ఇక త‌న ఎద భాగాలు కాస్త పెద్ద‌గా ఉండ‌డంతో వాటి గురించి కూడా కొంద‌రు ఇండ‌స్ట్రీ వాళ్లు చెడుగా మాట్లాడేవార‌ని… ఇలా ఎన్నో అవ‌మానాలు, ఇబ్బందులు ఎదుర్కొని.. అన్నింటికి త‌న‌కు తానే స‌ర్ది చెప్పుకుంటూ ఈ రోజు ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డాన‌ని చెప్పింది. ఇక అన్వేషి జైన్ తాజాగా తెలుగులో కమిట్మెంట్ అనే సినిమాలో కూడా కీల‌క పాత్రలో నటించింది. ఇటీవ‌లే రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో అమ్మ‌డికి అనుకున్న ప్రాధాన్య‌త రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news