Moviesనాగార్జున - రామ్‌చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...!

నాగార్జున – రామ్‌చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…!

టాలీవుడ్‌లో ఇటీవ‌ల కాలంలో మల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ బాగా న‌డుస్తోంది. సీనియ‌ర్ హీరోలు, స్టార్ హీరోలు సైతం జోడీ క‌ట్టి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ప‌దేళ్ల నుంచి ఈ ట్రెండ్‌లో స్పీడ్‌గా ఉన్నాడు సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌. వెంకీ ప‌వ‌న్‌, మ‌హేష్‌, రామ్‌, నాగ‌చైత‌న్య లాంటి హీరోల‌తో క‌లిసి న‌టించాడు. ఇక ఈ యేడాదే రెండు క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు వ‌చ్చాయి. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆరే క‌లిసి న‌టించారు అంటే మామూలు విష‌యం కాదు. వీరి త్రిబుల్ ఆర్‌తో పాటు ప‌వ‌న్ – రానా భీమ్లానాయ‌క్ కూడా వ‌చ్చింది. ఈ రెండు సినిమాలు స‌క్సెస్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలు కూడా స్టార్ హీరోలు, క్రేజీ హీరోల మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు మంచి ఊతం ఇచ్చాయ‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కాంబినేష‌న్లో వాల్తేరు వీర‌య్య వ‌స్తోంది. బాబి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ మ‌ల్టీస్టార‌ర్‌పై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంది.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, కింగ్ నాగార్జున కాంబినేష‌న్లో ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అక్కినేని, మెగా ఫ్యామిలీ హీరోలు ఈ త‌రంలో క‌లిసి న‌టించ‌లేదు. గ‌తంలో ఏఎన్నార్‌, చిరంజీవి ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఇప్పుడు నాగ్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ అంటే ఖ‌చ్చితంగా క్రేజీ కాంబినేష‌నే అవుతుంది. భీమ్లానాయ‌క్ సినిమాతో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె. చంద్ర ఈ క్రేజీ కాంబినేష‌న్లో సినిమాకు క‌థ రెడీ చేసే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

సాగ‌ర్ కె. చంద్ర కొత్త ద‌ర్శ‌కుడు అయినా కూడా భీమ్లానాయ‌క్ సినిమాలో రానా – ప‌వ‌న్‌ను బ్యాలెన్స్ చేస్తూ క‌థ న‌డిపించిన తీరుతో పాటు టేకింగ్‌కు మంచి మార్కులు వేయించుకున్నాడు. అందుకే సాగ‌ర్ కె. చంద్ర‌పై సీనియ‌ర్ హీరోల‌కు సైతం మంచి గురి కుదిరింది. వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్లో ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

వైజ‌యంతీ ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ప్ర‌భాస్‌తో ప్రాజెక్ట్ కే తో పాటు ఆగ‌స్టు 5న వ‌స్తోన్న సీతారామం చేస్తోంది. ఆ త‌ర్వాత నాగ్ – చెర్రీ మ‌ల్టీస్టార‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం. గ‌తంలోనే ఈ బ్యాన‌ర్లో నాగ్ – నాని క‌లిసి దేవదాస్ మ‌ల్టీస్టార‌ర్ చేశారు. ఇక ఇప్పుడు మ‌రోసారి నాగ్ – చెర్రీ కాంబినేష‌న్లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news