Moviesఅదిరిపోయే థ్రిల్లింగ్ యాక్ష‌న్‌... నాగార్జున‌కు ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్టే... ది ఘోస్ట్...

అదిరిపోయే థ్రిల్లింగ్ యాక్ష‌న్‌… నాగార్జున‌కు ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్టే… ది ఘోస్ట్ ట్రైల‌ర్ (వీడియో)

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా ది ఘోస్ట్‌. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున ఓ రా ఏజెంట్‌గా క‌నిపిస్తుండ‌గా.. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ రోజు రిలీజ్ అయిన ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిగా ఉంది. 1.54 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్లో షాట్స్ అన్ని అదిరిపోయాయి. ట్రైల‌ర్ ఆద్యంతం యాక్ష‌న్ క‌ట్స్‌, స్టైలీష్ టేకింగ్‌తో నింపేశారు. ట్రైల‌ర్లో నాగ్ ఊటి నుంచి ఫోన్ వ‌చ్చింది.. త‌మ్ముడిగా నువ్వు త‌న‌ని జాగ్ర‌త్త‌గా చూసుకుంటాను అని మాటివ్వు అంటూ వ‌చ్చే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైల‌ర్ స్టార్ట్ అయ్యింది.

కిడ్నాప‌ర్లు, మ‌ర్డ‌ర‌ర్స్‌, గ్యాంగ్‌స్ట‌ర్స్‌, అండ‌ర్ వ‌ర‌ల్డ్ ఇలా అన్ని గ్యాంగుల లింక‌ప్ నేప‌థ్యంలో ఘోస్ట్ సినిమా న‌డుస్తుంద‌ని ట్రైల‌ర్ చెప్పేసింది. నాగ్ సినిమాలో అండ‌ర్ వ‌ర‌ల్డ్‌ను మ‌ట్టుబెట్టే రా ఏజెంట్‌గా క‌నిపించ‌నున్నాడు. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్‌కు ప్ర‌యార్టీ ఇచ్చారు. ఇక సోనాల్ చౌహాన్ అందాల ఆర‌బోత కూడా బాగానే ఉంది.

ఏదేమైనా యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఘోస్ట్ ట్రైల‌ర్ అయితే చాలా ఆక‌ట్టుకుంది. నాగ్‌కు చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమాతో మంచి హిట్ బొమ్మ ప‌డేలా ఉంది. అక్టోబ‌ర్ 5న ఈ సినిమా వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news