Movies"హీరోలు ఇకనైన మారండి రా బాబు"..ఏ హీరోయిన్ చేయలేని పని చేసిన...

“హీరోలు ఇకనైన మారండి రా బాబు”..ఏ హీరోయిన్ చేయలేని పని చేసిన అనుపమ..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. బోలెడు మంది ఉన్నారు. అమ్మ పేర్లు, అమ్మమ్మ పేర్లు, నాన్న పేర్లు చెప్పుకొని కొంతమంది.. సినీ ఇండస్ట్రీపై ఉండే మోజుతో మరి కొంతమంది.. హీరోయిన్ గా వచ్చారు. అక్క సినిమాలోకి ఎంటర్ అయితే ఆమె పేరు చెప్పుకొని హీరోయిన్ గా ఎంటర్ అవుతున్న చెల్లెలు మరి కొంతమంది. ఇలా బోలేడు మంది ఉన్నారు. అయినా ఇండస్ట్రీలో ఎక్కువ డామినేట్ చేస్తుంది ఎవరు అంటే కన్నడ బ్యూటీలనే చెప్పాలి. ఆఫ్ కోర్స్ మన ఇండస్ట్రీలో మలయాళం బ్యూటీలో కూడా ఉన్నారు. కానీ కన్నడ బ్యూటీల తో పోలిస్తే మలయాళ బ్యూటీలకు కొంచెం లక్ తక్కువనే చెప్పాలి.


ఇప్పటికే మన ఇండస్ట్రీలో బోలెడుమంది మలయాళం బ్యూటీ లు ఉన్నారు. హీరోయిన్ నిత్యామీనన్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ , కీర్తి సురేష్ కూడా మలయాళ బ్యూటీనే..ఇలా అందరు మలయాళం ఇండస్ట్రీ కి చెందిన వారే. అయితే ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనం గమనించిన్నట్లైతే ఈ మలయాళం ముద్దుగుమ్మలు మొదటి సినిమాలతో బాగా హిట్ అందుకొని ఆ తర్వాత ఇండస్ట్రీలో తమ డిమాండ్ ను తగ్గించేసుకుంటున్నారు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే చాలామంది హీరోయిన్స్ కి ఇదే ఫార్ములా అప్లై అవుతుంది .

బొద్దుగుమ్మ నిత్యామీనన్ హాట్, హాట్ బ్యూటీ అను ఇమ్మానుయేల్, బబ్లీ నివేదా థామస్ ,కీర్తి సురేష్ అందరూ కూడా ఈ లిస్ట్ లోకే వస్తారు. వాళ్ళు చేసిన సినిమాలు మొదట్లో హిట్ అందుకున్న ఇప్పుడు ప్రజెంట్ ఆ స్ధాయి లో లేరనే చెప్పాలి. బ్లాక్ బస్టర్ హిట్స్ వాళ్ళ ఖాతాలో చాలా తక్కువ ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్న తరుణంలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా కార్తికేయ 2తో అలాంటి వాళ్లకి ఘాటు కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు ఏ హీరోయిన్ సాధించలేని ఘనత సాధించి మిగతా హీరోయిన్లు ముక్కున వేళ్లు వేసుకునేలా చేసింది.

మలయాళ బ్యూటీలు సినిమాలు అన్ని వరుసగా డిజాస్టర్ అవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో కొందరు స్టార్ హీరోలు మలయాళ బ్యూటీలకు ఆఫర్లు ఇవ్వడమే మానేశారు. అందులో మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ మలయాళ బ్యూటీలకి టాలెంట్ ఉంది.. వాళ్ళు ఐరన్ లెగ్స్ కాదు అంటూ మరోసారి స్టార్ హీరోలకు బుద్ధి వచ్చేలా చేసింది అంటున్నారు నెటిజన్స్. అంతేకాదు మలయాళ బ్యూటీలు ఎంత అందగత్తెలు అంతకన్నా తెలివితేటలు గల వ్యక్తులు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇకనైనా మలయాళ బ్యూటీలను సినిమాలో తీసుకుంటారా మన హీరోలు చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news