Moviesమిగతా హీరోయిన్స్ లో లేనిది..నయనతార లో ఉన్నది ఏంటబ్బా..?

మిగతా హీరోయిన్స్ లో లేనిది..నయనతార లో ఉన్నది ఏంటబ్బా..?

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కొందరు ఇంటి పేరు చెప్పుకుని హీరోయిన్స్ అయితే..కొందరు అందం చూయించుకుని..హీరోయిన్స్ అయ్యారు. కొందరు పాపులారిటి కోసం కొందరు డబ్బు కోసం..ఇలా అందరు హీరోయిన్స్ తమ సొంత టాలెంట్ ను బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లల్లో కొందరినే జనాలు తమ మనసులో పెట్టుకుంటారు. వాళ్లు ఎన్ని తప్పులు చేసినా..మంచి మనసుతో క్షమించి తమ గుండెల్లో పెట్టుకుంటారు . అలాంటి ఓ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సౌత్ క్రేజీ సూపర్ స్టార్ నయనతార.

అమ్మడు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన దైన టాలెంట్ తో..అందంతో యువత ను ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తుంటుంది. ఎమోషన్ల్ సీన్స్ లో ఏడిపిస్తూ ఉంటుంది. నయన్ తన కెరీర్ లో చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. మిగతా హీరోయిన్స్ లా ఎక్స్ పోజింగ్ చేసినా.. తన మనసుకి నచ్చిన పాత్రలు చేసి..ఓ నటిగా ఫుల్ స్టాఇస్ ఫై అయ్యే పాత్రలు చేసింది. ప్రజెంట్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుని.. మ్యారిడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ సినిమాలు కూడా తీస్తుంది. అయితే, తాజా గా కాఫీ విత్ కరణ్ షో లో నయన తార పై కరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

సమంత ..నయన్ గురించి మాట్లాడుతూ..”ఆమె గొప్ప నటి..నాకు చాలా కనెక్ట్ అయ్యింది..”అన్నట్లు చెప్పుకొస్తుంది. అయితే దానికి కరణ్..”ఓ..అవునా..బట్ నా లిస్ట్ లో లేదు”…అంటూ నయన్ ను అవమానించాడు. దీంతో ఆమె ఫ్యాన్స్ కు మండింది. నీ బాలీవుడ్ హీరోయిన్స్ కన్నా..నయన్ 100 టైమ్‌స్ బెటర్.. నటనలో ఆమె ను చూసి మీరు నేర్చుకోవాలి..అయిన సౌత్ లోనే క్రేజీ సూపర్ స్టార్ అంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ పై ఇలాంటి కామెంట్స్ చేయడానికి సిగ్గులేదా..అంటూ కరణ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

అయితే, ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే..నయన్ గొప్ప నటి ఓకే ఒప్పుకుంటాం..కానీ బాలీవుడ్ నటులు వేస్ట్..ఆమె ఇండస్ట్రీకి ఓ దేవత..మిగిలిన హీరోయిన్స్ పనికిరారు అనే కామెంట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నాయి అంటున్నారు మిగత అభిమానులు. నయన టాలెంటెడ్ కాదని చెప్పము..కానీ ఇండస్ట్రీలో తనే టాలెంటెడ్ మిగిలిన వారు డమ్మిలు అనడం..సరికాదు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే దీని పై కరణ్ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news