Moviesకొర‌టాల సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఇదే... ఆ సీక్రెట్ ఇలా బ‌య‌ట‌కొచ్చేసింది...!

కొర‌టాల సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఇదే… ఆ సీక్రెట్ ఇలా బ‌య‌ట‌కొచ్చేసింది…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ స‌క్సెస్‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్‌ను కెరీర్‌లో ఫ‌స్ట్ టైం త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రెండు క్రేజీ పాన్ ఇండియా సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ముందుగా త‌న కెరీర్‌లో 30వ సినిమాగా వ‌స్తోన్న సినిమాను కొర‌టాల శివ‌తో చేస్తున్నాడు. ఆ త‌ర్వాత కేజీయ‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31వ సినిమా ఉంటుంది. ఈ రెండూ కూడా పాన్ ఇండియా లెవ‌ల్లోనే వ‌స్తున్నాయి. రెండు సినిమాలపై ఎనౌన్స్‌మెంట్ రావ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు.

ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్‌ను యువ‌సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా వ‌స్తోంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇటీవ‌లే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌కు సైతం సూప‌ర్ రెస్పాన్స్ ల‌భించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్‌, పాత్ర ఎలా ఉండ‌బోతోందో క్లారిటీ వ‌చ్చేసింది.

ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన బింబిసార సినిమా ఆగ‌స్టు 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వ‌చ్చారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ లుక్‌ను గ‌మ‌నిస్తే ఫుల్‌గా గ‌డ్డంతో పాటు ర‌ఫ్ లుక్‌లో ఉన్నాడు. అంటే సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఏ టైప్‌లో ఉండ‌బోతోందో ఓ క్లారిటీకీ అయితే ఫ్యాన్స్ వ‌చ్చేశారు.

కొర‌టాల సినిమాలో తాను చేసే క్యారెక్ట‌ర్ కోస‌మే ఎన్టీఆర్ ఈ లుక్‌లో సిద్ధ‌మ‌య్యాడ‌ని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌బోతోంద‌ని అంటున్నారు. కొర‌టాల త‌న గ‌త సినిమాల‌కు భిన్నంగా యాక్ష‌న్ డోస్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని.. సినిమా చివ‌ర్లో ఓ మెసేజ్ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news