Moviesసిద్దార్థ్ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ లవర్ బాయ్ ......

సిద్దార్థ్ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ లవర్ బాయ్ … ఇంత‌మంది హీరోయిన్ల‌తో ఎఫైరా…!

టాలీవుడ్ లో ల‌వ‌ర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్న హీరోల‌లో సిద్దార్థ్ కూడా ఉంటాడు. బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా తో పాటూ మ‌రికొన్ని ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించి సిద్దార్థ్ లేడీ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. అయితే సిద్దార్థ్ ఆన్ స్క్రీన్ పైనే కాదు… ఆఫ్ స్క్రీన్ లోనూ ల‌వ్ బాయ్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే మ‌నోడు ల‌వ్ ఎఫైర్ న‌డిపిన హీరోయిన్స్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే మ‌రి. రీసెంట్ గా సిద్దార్థ్ హీరోగా మ‌హాస‌ముద్రం అనే సినిమా వ‌చ్చి బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన అదితి రావ్ హైద‌రీతో ప్ర‌స్తుతం సిద్దార్థ్ ప్రేమ‌లో ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇంత‌కు ముందే ఆమెకు ఓ పెళ్ల‌య్యి విడాకులు కూడా అయిపోయాయి. రీసెంట్ గా ఈ జంట ముంబై లో బాలీవుడ్ మీడియా కంట‌ప‌డ‌గా… నేను ఇక్క‌డి వాన్ని కాదు ఫోటో బ‌య‌ట‌కు వ‌స్తే మ‌ర్యాద‌గా ఉండ‌దు అంటూ ఫోటో గ్రాఫర్ల‌కు వార్నింగ్ ఇచ్చాడట‌. దాంతో సిద్దార్థ్ – అదితిరావ్ హైద‌రీల వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే గ‌తంలో సిద్దార్థ్ ల‌వ్ ఎఫైర్స్ న‌డిపిన హీరోయిన్ల లిస్టు పెద్ద‌దే.

నాగ‌చైత‌న్య కంటే స‌మంత ముందుగా సిద్దార్థ్ తోనే ప్రేమ‌లో ప‌డింది. జ‌బ‌ర్ద‌స్త్ సినిమా స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ జంట కొంత‌కాలం చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు కూడా. ఆ త‌రవాత ఏం జ‌రిగిందో కానీ వీరిద్ద‌రూ దూర‌మ‌య్యారు. చైతూతో స‌మంత విడాకుల త‌ర‌వాత కూడా సిద్దార్థ్ స‌మంతపై సెటైర్ లు వేసి అంద‌రిచేతా చివాట్లు తిన్నాడు.

సిద్దార్థ్ బాలీవుడ్ సినిమా రంగ్ దే బ‌సంతి సినిమాలో న‌టించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన సోహా అలీఖాన్ తో ప్రేమాయ‌ణం న‌డిపించాడు. ఆ విష‌యం తెలుసుకున్న సిద్దార్థ్ మొద‌టి భార్య ఛీకొట్టి విడాకులు ఇచ్చింది. ఆ త‌ర‌వాత సిద్దార్థ్ ముంబైలో సోహా అలీఖాన్ ఇంట్లోనే చాలా కాలం ఉన్నాడు. ఇద్ద‌రికీ గొడ‌వ‌లు జ‌ర‌గ‌టంతో సోహా కూడా సిద్దార్థ్ ను వ‌దిలేసింది. ఆ త‌రవాత సిద్దార్థ్ మాయ‌లో శృతిహాస‌న్ ప‌డిపోయింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన శృతిహాస‌న్ సిద్దార్థ్ తో స‌హ‌జీవ‌నం కూడా చేసింది. 2011లో వీరిద్ద‌రూ విడిపోయారు. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌లు కూడా లేవు.

సిద్దార్థ్ హీరోయిన్ దీప స‌న్నిధితో కూడా ప్రేమాయ‌ణం న‌డిపించార‌ని అప్ప‌ట్లో త‌మిళ మీడియా కోడై కూసింది. కానీ ఆ వార్త‌లను హీరో దీప స‌న్నిధి ఖండించింది. అస‌లు సిద్దార్థ్ తో తాను ట‌చ్ లోనే లేన‌ని బుకాయించింది. ఇక ఇంతమంది భామ‌ల‌కు బ్రేక‌ప్ చెప్పిన సిద్దార్థ్ మ‌రి అదితి రావ్ హైద‌రితో అయినా బంధాన్ని కొన‌సాగిస్తాడా లేదా చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news