Moviesఅది నా భర్త కష్టం..మూడో ప్రెగ్నెన్సీ పై మైండ్ బ్లాకింగ్ స్టేట్మెంట్...

అది నా భర్త కష్టం..మూడో ప్రెగ్నెన్సీ పై మైండ్ బ్లాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన కరీనా..!!

హా..హా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్..భలే ఆన్సర్ ఇచ్చింది. మనకు తెలిసిందే..కరీనా కపూర్ కి ఆల్ రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ అమ్మడు..మ్యారిడ్ లైఫ్ ను పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే బోలెడు సినిమాలు చేసిన తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.

కాగా, ఇద్దరు బిడ్డలకు తల్లైన ఇంకా చక్కగా ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ..కుర్ర హీరోయిన్లకు కాంపీటీషన్ ఇస్తుంది. అయితే, తాజా గా అమ్మడు మూడో సారి తల్లి కాబోతుంది అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. అమ్మడుకి ఏకంగా ఐదో నెల అని కూడా ఫిక్స్ చేశారు గాసిప్ రాయళ్లు. ఈ న్యూస్ అటు తిరిగి ఇటు తిరిగి..కరీనా కంట పడ్డింది. అంతే వెంటనే సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

“నేను ప్రెగ్నెంట్ కాదు. ఆ పొట్ట నా కడుపులో ఉన్న పాస్త, వైన్ వల్ల వచ్చింది. దేశ జనాభాను పెంచడానికి నా భర్త సైఫ్ ఇప్పటికే చాలా కష్టపడ్డాడు”.. అంటూ కామెడీ గా చెప్పుకొచ్చింది కరీనా . ఇప్పుడు కరీనా పెట్టిన మెసేజ్ వైరల్ గా మారింది. తాను ప్రెగ్నెంట్ కాదు డైరెక్ట్ గా చెప్పితే సరిపోతాది కదా ..ఇంత భారీ స్టేట్ మెంట్లు అవసరమా..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళి ఎక్కడ తన పై ఇలాంటీ రూమర్స్ వస్తాయో అని..ముందుగానే కరీనా..మాకు మూడో బేబీ ఆలోచన లేదు అని ఈవిధంగా చెప్పుకొచ్చింది కరీనా. తాను గర్భవతిని కాని అని చెప్పడంలో కరీనా తీరు చూసి అంతా అవాక్కయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news