Moviesఇండస్ట్రీకి ఆ పరిస్ధితి దాపురించింది..మహేష్ బాబు స్టేజీ డ్యాన్స్ పై అల్లు...

ఇండస్ట్రీకి ఆ పరిస్ధితి దాపురించింది..మహేష్ బాబు స్టేజీ డ్యాన్స్ పై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్..!!

అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో తన మార్క్ తో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ..అగ్ర ప్రోడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రజంట్ ఈయన గోపీచంద్ హీరో గా నటిస్తున్న “పక్క కమర్షీయల్” సినిమాకి నిర్మాతగ వ్యవహరిస్తున్నారు. సినిమా ను జూలై ఒకటిని గ్రాండ్ ధియేటర్స్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే..తాజా గా ఓ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి..సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.

ఈ మీట్ కి చిత్ర బృందం తో పాటు..హీరో గోపీచంద్ కూడా వచ్చారు. నిజానికి గోపీచంద్ ఇలాంటి ఫంక్షన్లకి రాడు. ఆయన సొంత సినిమా అయిన ఆయన ప్రమోషన్స్ చేయడానికి ఇష్టపడరట. అంత సిగ్గు గోపీచంద్ కి బయట కనిపించాలంటే. ఈ విషయాని స్వయాన నిర్మాత అల్లు అరవింద్ నే చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ..”గోపీచంద్ ఈ ఫంక్షన్ కి రావాలని పట్టుబట్టి చెప్పి మరీ ఓప్పించి డైరెక్టర్ బలవంతం చేస్తే గోపీ వచ్చాడు . ఇలాంటి ఫంక్షన్లు ఆయనకి అలవాటు లేదు..ఇష్టం లేదు. కానీ, ఇక పై అలా అంటే కుదరదు. సినిమా ని ప్రమోట్ చేసుకోవడానికి..హీరో,హీరోయిన్లు కూడా ప్రమోషన్స్ లో పాల్గొనాలి”..అంటూ చెప్పుకొచ్చారు.

అంతేనా..ఇంకా ఆయన మాత్లాడుతూ..”ఏ ప్రేక్షకుడు కూడా ధియేటర్ కి మా ఫేస్ లు (నిర్మాతల) రారు. మీ కోసమే వస్తారు. అలాంటి మీరే మీ సినిమాకు బలం. మీరు ప్రమోషన్స్ చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఈ మధ్య కాలలో ఇందస్ట్రీలో స్టార్ హీరో కూడా స్టేజీ పై డ్యాన్స్ వేసి వాళ్ళ సినిమా ను ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది ” అంటూ చెప్పుకొచ్చారు. మనకు తెలిసిందే. సర్కారు వారి పాట సక్సెస్ మీట్ లో మహేష్..స్టేజీ పై డ్యాన్స్ వేసి..అభిమానులను సంతోష పెట్టాడు. దీంతో ఇప్పుడు అల్లు అరవింద్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news