Moviesహేమచంద్ర-శ్రావణభార్గవి మధ్య చిచ్చు పెట్టిన ఆ స్టార్ సింగర్..సంచలనంగా మారిన వాయిస్...

హేమచంద్ర-శ్రావణభార్గవి మధ్య చిచ్చు పెట్టిన ఆ స్టార్ సింగర్..సంచలనంగా మారిన వాయిస్ క్లిప్..?

ఈ మధ్య కాలంలో స్టార్ సెలబ్రిటీలు ఎక్కువుగా విడాకులు తీసుకుంటూ నెట్టింట చర్చనీయాంశంగా మారుతున్నారు. ఇష్టపడి ప్రేమించుకుని..పెద్దలను ఓప్పించి..పెళ్లి చేసుకుని..సంతోషంగా గడపాలి అనుకుని ఏడు అడుగులు వేస్తున్న జంటలు..ఎవ్వరు ఊహించని విధంగా విడాకులు ప్రకటిస్తూ..అభిమానుల గుండెలు బద్ధలు కొడుతున్నారు . ఇప్పటికే ఇలా ఎన్నో చూడ ముచ్చట జంటలు విడాకులు ప్రకటించి..అభిమానుల హృదయాలను ముక్కలు చేసేశారు.

సమంత-నాగచైతన్య, ధనుష్-ఐశ్వర్య,శ్రీజ-కల్యాణ్ దేవ్..ఇలా స్టార్ జంటలు విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, రీసెంట్ గా వీళ్ల బాటలోనే మరో జంట డివోర్స్‌ తీసుకునేందుకు రెడీ అయిందంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త గింగిరాలు తిరుగుతోంది. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ శ్రావణ భార్గవి-హేమ చంద్ర..ఈ లవబుల్ కపుల్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీస్తే.. సంచలన మ్యాటర్ వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తుంది.

సూపర్ సింగర్స్ గా పేరు సంపాదించుకున్న హేమ చంద్ర, శ్రావణ భార్గవి..కి ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు కూడా సినిమాలకు డబ్బింగ్స్ చెప్పుతూ..మరో పక్క పాటలు పాడుతూ..అదే టైంలో స్టేజీ షోస్ చేస్తూ..కెరీర్ పరం గా బిజీగా ఉన్నారు. అయితే, వీళ్ళైద్దరికి క్లోజ్ ఫ్రేండ్ అయిన ఓ స్టార్ సింగర్ వీరి విడాకులకు కారణం అంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.

సరదాగా మాట్లాడుకున్న మాటలు కాస్త పచ్చటి సంసారాని విడిపోయే విధంగా చేశాయి అంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాలల్లో వైరల్ అవుతుంది. హేమ చంద్ర క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ..ఓ సో కాల్డ్ ఫ్రెండ్ ద్వారా శ్రావణ భార్గవి చేతికి చేరిందని…ఆ మాటలు విన్న శ్రావణ భార్గవి మనసు ముక్కలైందని..అందుకే విడాకులు తీసుకోబోతున్నారని ఓ తల తోక లేని వార్త నెట్టింత వైరల్ గా మారింది. అయితే, ఇప్పటి వరకు వీరు విడాకుల పై కానీ, వారి వస్తున్న వార్తలు పై కానీరెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news