Moviesలీకైన `ఎన్టీఆర్ 30` ఇంటర్వెల్ బ్యాంగ్.. నెక్స్ట్ లెవ‌ల్ అంతే!

లీకైన `ఎన్టీఆర్ 30` ఇంటర్వెల్ బ్యాంగ్.. నెక్స్ట్ లెవ‌ల్ అంతే!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్‌తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ అనంత‌రం ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొరటాల శివ‌తో చేయ‌బోతున్నాడు. ఇది తార‌క్‌కు 30వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు తీసుకువెళ్ల‌బోతున్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

అదేంటంటే.. `ఎన్టీఆర్ 30` ఇంటర్వెల్ బ్యాంగ్ కొర‌టాల నెక్స్ట్ లెవ‌ల్‌లో ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం హైదరాబాదులో హై బ‌డ్జెట్‌తో ఒక ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట‌. అయితే ఆ యాక్షన్ సీన్ చివర్లోనే ఈ సెట్ ను బ్లాస్ట్ చేయనున్నారని, అదే తెరపై ఇంటర్వెల్ బ్యాంగ్ గా వస్తుందని అంటున్నారు.

ఈ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌ని.. అంత అద్భుతంగా కొర‌టాల దాన్ని డిజైన్ చేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌క నిజ‌మో తెలియాల్సి ఉంది. ఇక‌పోతే ఈ మూవీ కోసం తార‌క్ బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్నాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది ఇంకా స్ప‌ష్టత రాలేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news