Moviesఒక్క యేడాదిలో 50 సార్లు డేటింగ్‌కు వెళ్లిన న‌టి... ఎంత మంది...

ఒక్క యేడాదిలో 50 సార్లు డేటింగ్‌కు వెళ్లిన న‌టి… ఎంత మంది అబ్బాయిలో…!

ఒక‌టి రెండు సార్లు డేటింగ్‌కు వెళ్ల‌డానికే చాలా ఆలోచించి లెక్క‌లు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు డేటింగ్ ట్రెండ్ అనేది సెల‌బ్రిటీల్లో కామ‌న్ అయిపోయింది. ఎప్పుడు ఎవ‌రు ? ఎవ‌రితో డేటింగ్‌లో ఉంటారో తెలియ‌డం లేదు. అయితే డేటింగ్ ఉన్న జంట‌లు క‌నీసం రెండు, మూడేళ్లు అయినా క‌లిసి ఉంటున్నాయి. ఆ త‌ర్వాత వారు విడిపోవ‌డం డేటింగ్ కోసం మ‌రో భాగ‌స్వామిని వెతుక్కోవ‌డం కామ‌న్‌.

అయితే ఓ న‌టి మాత్రం ఒక్క యేడాదిలోనే ఏకంగా 50 సార్లు డేటింగ్‌కు వెళ్లింద‌ట‌. ఈ విషయాన్ని ఆమే స్వ‌యంగా చెప్పుకువ‌చ్చింది. అసలు ఆమె ఈ 50 సార్లు డేటింగ్‌కు ఎంత మందితో వెళ్లింది ? ఎందుకు వెళ్లింది ? అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఆమె డేటింగ్ గురించి చెప్పిన విష‌యాల‌తో అంద‌రూ షాక్‌లోకి వెళ్లిపోయారు.

ఆ న‌టి ఎవ‌రో కాదు ప్రముఖ ఆస్ట్రేలియ‌న్ న‌టి రెబ‌ల్ విల్స‌న్‌. 2019లో ఆమె వ‌య‌స్సు 39 ఏళ్లు. ఆ వ‌య‌స్సులో ఆమె యేడాది కాలంలోనే ఏకంగా 50 సార్లు వేర్వేరు వ్య‌క్తుల‌తో డేట్‌ల‌కు వెళ్లాన‌ని చెప్పింది. తాను డేటింగ్‌కు వెళ్లిన వారిలో కొంద‌రు బిలియ‌నీర్లు కూడా ఉన్నార‌ని.. మ‌రి కొంద‌రు ఏమీ లేని వాళ్లు కూడా ఉన్న‌ట్టు రెబ‌ల్ విల్స‌న్ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు తాను రిలేష‌న్ ఫిఫ్‌లో ఉన్న వ్య‌క్తి ఓ మ్యూచువ‌ల్ ఫ్రెండ్ ద్వారా ప‌రిచ‌యం అయిన‌ట్టు కూడా విల్స‌న్ పేర్కొంది. ఒక్క యేడాదిలో ఏకంగా 50 మందితో డేట్ చేశాన‌ని ఈ అమ్మ‌డు చెపుతుండడంతో ఇప్పుడు అంద‌రూ నోరెళ్ల‌బెడుతున్నారు. రెబల్ విల్సన్ పూర్తి పేరు రెబెల్ మెలానియా ఎలిజిబెత్ విల్సన్‌. కామెడీ పాత్ర‌లు పోషించ‌డంలో ఆమె ప్ర‌సిద్ధికెక్కింది. ఆమె ర‌చ‌యిత కూడా..!

రెబ‌ల్ విల్స‌న్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ న్యూసౌత్ వేల్స్‌లో జ‌న్మించింది. ఆమె ఆస్ట్రేలియ‌న్ థియేట‌ర్ యంగ్ పీఫుల్లో యాక్టింగ్ నేర్చుకుంది. ఆ త‌ర్వాత ఆమె న‌ట‌న‌లో శిక్ష‌ణ కోసం న్యూయార్క్ కూడా వెళ్లింది. ఇప్పుడు విల్స‌న్ వ‌య‌స్సు 42 ఏళ్లు అయినా చూసేందుకు కుర్ర హీరోయిన్‌లా ద‌ర్శ‌న‌మిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news