Moviesఇన్ని సినిమాల పోటీ త‌ట్టుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన బాల‌య్య బొబ్బిలి సింహం..!

ఇన్ని సినిమాల పోటీ త‌ట్టుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన బాల‌య్య బొబ్బిలి సింహం..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అంటేనే మాస్ సినిమాల‌కు కేరాఫ్‌. త‌న‌దైన మాస్ సినిమాల‌తో బాల‌య్య తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే కాకుండా.. త‌న అభిమానుల‌ను ఉర్రూత‌లూగించేస్తాడు. బాల‌య్య‌కు ఎన్ని ప్లాపులు వ‌చ్చినా ఒక్క హిట్ ప‌డితే చాలు ఆయ‌న ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేస్తాడు. ఆయ‌న అభిమానుల ఆనందాల‌కు అవ‌ధులే ఉండ‌వు. మూడు వ‌రుస ప్లాపుల త‌ర్వాత అఖండ సినిమా వ‌చ్చి ఎంత బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యిందో చూశాం. బాల‌య్య సినిమా జ‌నాల‌కు ఎక్కిందంటే ఎవ్వ‌రూ ఆప‌లేరు.

ఇక బాల‌య్య – మాస్ సినిమాల ద‌ర్శ‌కుడు కోదండ రామిరెడ్డి కాంబినేష‌న్ అంటేనే అదిరిపోయే మాస్ మ‌సాలా. ఆ టైంలో కోదండ రామిరెడ్డి – బాల‌య్య కాంబోలో ఎన్నో సూప‌ర్ హిట్లు వ‌చ్చాయి. తాను ఎన్టీఆర్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ వ‌చ్చినా ఉప‌యోగించుకోలేక‌పోయాన‌ని.. అయితే ఆ లోటు బాల‌య్య‌తో చేసి సూప‌ర్ హిట్లు కొట్టి తీర్చుకున్నాన‌ని కోదండ రామిరెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు లాంటి సూప‌ర్ హిట్‌తో బాల‌య్య‌ను మాస్‌లో .. అది కూడా మ‌హిళా ఫ్యాన్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేయ‌డంలో కోదండ రామిరెడ్డి కీ రోల్ ప్లే చేశారు.

ఇక వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ బొబ్బిలి సింహం. 1994 సెప్టెంబ‌ర్ 24న రిలీజ్ అయిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రు. 7 కోట్ల షేర్ రాబ‌ట్టింది. కీర‌వాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. బాల‌య్య‌కు జోడీగా అప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న రోజా, మీనా న‌టించారు. ఇందులో రోజాది నెగిటివ్ పాత్ర‌గా ఉన్న ఆ పాత్ర సెంటిమెంట్ హృద‌యాల‌ను పిండేసింది. బొబ్బిలి సింహం 60 కేంద్రాల్లో 50 రోజులు, 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

ఇక ఈ సినిమాకు పోటీగా కొన్ని సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమా రిలీజ్ అవ్వ‌డానికి 7 రోజుల ముందుగా రాజేంద్ర ప్ర‌సాద్ అల్ల‌రోడు రిలీజ్ అయ్యింది. కె. అజ‌య్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కామెడీకి పెద్ద పీట వేసినా ప్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల‌కు సెప్టెంబ‌ర్ 30న ఎస్వీ కృష్ణా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శుభ‌ల‌గ్నం సూప‌ర్ హిట్ అయ్యింది. ఆమ‌ని, జ‌గ‌ప‌తిబాబు, రోజా న‌టించిన ఈ సినిమా అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది.

ఇక బొబ్బిలి సింహం సినిమా రిలీజ్ అయిన 8 రోజుల‌కు సుమ‌న్ – రంభ జంట‌గా న‌టించిన హ‌లో అల్లుడు మూవీ వ‌చ్చింది. ఈ సినిమాలో వాణీ శ్రీ అత్త‌గా న‌టించారు. ఈ సినిమా యావ‌రేజ్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ టైంలోనే విక్ట‌రీ వెంక‌టేష్ – రంభ‌, ర‌మ్య‌కృష్ణ న‌టించిన ముద్దుల ప్రియుడు సినిమా వ‌చ్చింది. కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news