Moviesఆ హీరోయిన్‌తో ఆలీ రెండో పెళ్లి... అప్ప‌ట్లో ఇదో సంచ‌ల‌నం...!

ఆ హీరోయిన్‌తో ఆలీ రెండో పెళ్లి… అప్ప‌ట్లో ఇదో సంచ‌ల‌నం…!

సినిమా ఇండ‌స్ట్రీలో గాసిప్‌లు అనేవి స‌ర్వ‌సాధార‌ణం. హీరోలు, హీరోయిన్లు క‌లిసి ఎక్కువ అక్క‌ర్లేదు. రెండు సినిమాలు చేస్తే చాలు.. వారిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని రాసేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే అంతా సోష‌ల్ మీడియా మ‌యం అయిపోయింది. అప్ప‌ట్లో అంటే 20 ఏళ్ల క్రితం ఇలాంటి గాసిప్‌ల‌కు సితార‌, శివ‌రంజ‌నీ, స్వాతీ వీక్లీ లాంటి మ్యాగ‌జైన్సే ఆధారం. అందులో వ‌చ్చే గాసిప్‌లు బాగా పేలేవి. ఇక క‌మెడియ‌న్ ఆలీ ఇండ‌స్ట్రీలో దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాలుగా కొన‌సాగుతూ వ‌స్తున్నారు.

ఆలీ స్వ‌స్థ‌లం రాజ‌మండ్రి. సినిమాల‌పై ఇంట్ర‌స్ట్‌తో ముందు చెన్నై వెళ్లాడు. అక్క‌డ చిన్నా చిత‌కా వేషాలు వేసుకుంటూ క‌మెడియ‌న్ అయ్యాడు. ఆ త‌ర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు కూడా చేశాడు. సూప‌ర్ హిట్స్ కూడా ప‌డ్డాయి. ఆ త‌ర్వాత తిరిగి క‌మెడియ‌న్‌గా సెటిల్ అయ్యాడు. ఇక ఇప్పుడు ప‌లు టీవీ షోలు చేస్తూ ఇటు బుల్లితెర మీద కూడా పాపుల‌ర్ అయ్యాడు. ఆలీ అంటేనే ఓ కామెడీ.. త‌న‌కో స్టైల్ ఉంటుంది.

ఇక ఆలీ కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు. ఆలీ న‌టించిన అల్ల‌రి పెళ్లికొడుకు సినిమాలో ఆలీకి జోడీగా శుభ శ్రీ న‌టించింది. శుభ శ్రీ ఎవ‌రో కాదు.. ఒక‌ప్ప‌టి స్టార్ న‌టి మాలా శ్రీకి స్వ‌యానా చెల్లి. మాలా శ్రీ క‌న్న‌డ హీరోయిన్‌. ఆమె తెలుగులో 1990వ ద‌శ‌కంలో త‌న భారీ అందాల‌తో ఓ ఊపు ఊపేసింది. ఈ క్ర‌మంలోనే మాలా శ్రీ త‌న చెల్లిని శుభ శ్రీని కూడా సినిమాల్లోకి తీసుకువ‌చ్చింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు శుభ శ్రీ బుల్లితెర‌పై క‌నిపించింది.

తన హీరో ఆలీ వ్యాఖ్యాత‌గా చేస్తోన్న బుల్లితెర షోకు ఆమె వ‌చ్చింది. ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే శుభ శ్రీ ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం చెప్పింది. అక్క మాల సినిమాలు చేస్తోన్న టైంలో త‌న‌కు స్కూల్‌కు వెళ్ల‌డం ఇష్టంలేకే సినిమాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పింది. అస‌లు త‌న పేరు భార‌తి పాండే అని.. త‌న‌కు పెళ్లి అయ్యింది.. త‌న భ‌ర్త త‌న‌కంటే స‌న్న‌గా ఉంటాడ‌ని శుభ శ్రీ చెప్పింది. తాను ఆడుకుంటోన్న టైంలోనే త‌న భ‌ర్త వ‌చ్చి లైన్ వేసేవాడ‌ని.. అలా ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింద‌ని చెప్పింది.

తాను కేవ‌లం ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకున్నాన‌ని శుభ శ్రీ చెపితే.. ఆలీ నీ కంటే ఓ త‌ర‌గ‌తి ఎక్కువ 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివాన‌ని చెప్పాడు. ఇదిలా ఉంటే ఆలీ శుభ శ్రీతో త‌న‌కు జ‌రిగిన పెళ్లి గురించి ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట పెట్టాడు. అల్ల‌రి పెళ్లికొడుకు సినిమా టైంలో వీరిద్ద‌రి పెళ్లికి సంబంధించిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ట‌. ఓ మ్యాగ‌జైన్‌లో ఆ హీరోయిన్‌తో ఆలీ పెళ్లి అని టైటిల్ పెట్టి ఆ ఫొటో వేసింద‌ట‌.

ఆ మ్యాగ‌జైన్ చూసిన ఆలీ మామ‌గారు ఆ ఫొటో తీసుకువెళ్లి త‌న భార్య‌కు చూపించాడ‌ని చెప్పింది. దీంతో శుభ శ్రీ నిజ‌మా అని ఫ‌క్కున న‌వ్వేసింది. అప్ప‌ట్లో ఈ ఫొటో బాగా వైర‌ల్ అయ్యింది. శుభ శ్రీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ హీరోగా వ‌చ్చిన జెంటిల్‌మ‌న్ సినిమాలో కూడా న‌టించింది. అక్క‌లా ఎక్కువ సినిమాలు అయితే చేయ‌లేదు కాని.. త‌క్కువ టైంలోనే కెరీర్‌కు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news