Movies1992లో ముగ్గురు స్టార్ హీరోలు 3 బ్లాక్‌బ‌స్ట‌ర్లు.. ఎవ‌రు గెలిచారంటే..!

1992లో ముగ్గురు స్టార్ హీరోలు 3 బ్లాక్‌బ‌స్ట‌ర్లు.. ఎవ‌రు గెలిచారంటే..!

1990వ ద‌శ‌కం స్టార్టింగ్‌లో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ బాగా క‌ళ‌క‌ళ‌లాడింది. ప‌లువురు త‌ళుక్కుమ‌నే హీరోయిన్లు వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. బొబ్బిలి రాజా సినిమాతో దివ్య‌భార‌తి – పెద్దింటి అల్లుడు సినిమాతో న‌గ్మా – ఇంద్ర‌భ‌వ‌నం సినిమాతో మీనా – ఆ ఒక్క‌టి అడ‌క్కుతో రంభ – స‌ర్ప‌యాగంతో రోజా – ఆ ఒక్క‌టి అడ‌క్కుతో రంభ – మ‌వ‌న‌రాలి పెళ్లితో సౌంద‌ర్య వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. వీరు ఓ ఐదారేళ్ల పాటు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని ఏలేశారు అనే చెప్పాలి.

ఇక 1992లో నాడు స్టార్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి – న‌ట‌సింహం బాల‌కృష్ణ – విక్ట‌రీ వెంక‌టేష్ ఈ ముగ్గురు సంచ‌ల‌నాలు న‌మోదు చేశారు. ఈ ముగ్గురు హీరోలు న‌టించిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. చిరంజీవి విష‌యానికి వ‌స్తే ఆయ‌న న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ 1991లో రిలీజ్ అయ్యి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టింది. ఆ మ‌రుస‌టి యేడాది కె రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఘ‌రానా మొగుడు సినిమా వ‌చ్చింది. కె. దేవీ వ‌ర‌ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమాలో చిరు ప‌క్క‌న న‌గ్మా, వాణీ విశ్వ‌నాథ్ హీరోయిన్లుగా న‌టించారు.

ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. చిరు బాడీ లాంగ్వేజ్‌, మేన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్, ఫైట్లు.. న‌గ్మాతో సీన్లు ఇవ‌న్నీ ఈ సినిమాను సూప‌ర్ హిట్ చేశాయి. చిరు కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంది ఈ సినిమాకే ఫ‌స్ట్‌. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ – బి. గోపాల్ కాంబినేష‌న్లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన సినిమా బొబ్బిలి రాజా. ఈ సూప‌ర్ హిట్ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ – ర‌విరాజా పినిశెట్టి కాంబినేష‌న్లో వ‌చ్చిన చంటి. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌పై కేఎస్‌. రామారావు నిర్మించిన ఈ సినిమా విభిన్న‌మైన క‌థాంశంతో వ‌చ్చి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేసేసింది.

ఇళ‌య‌రాజా పాట‌లు, వెంకీ అమాయ‌క‌పు న‌ట‌న‌, మీనా ప్రేమ‌, సుజాత తల్లి సెంటిమెంట్‌, నాజ‌ర్ అన్న సెంటిమెంట్ ఇవ‌న్నీ ఈ సినిమాను బ్లాక్‌బ‌స్ట‌ర్ చేశాయి. ఇక ఇదే యేడాది నటసింహం బాల‌కృష్ణ కూడా దూసుకువ‌చ్చాడు రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా.. అంత‌కు ముందు బాల‌య్య – బి. గోపాల్ కాంబోలో వ‌చ్చిన లారీ డ్రైవ‌ర్ సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌రోసారి ఈ కాంబినేష‌న్ రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ సినిమాతో రిపీట్ అయ్యింది.

 

ఈ సినిమాలో బాల‌య్య – విజ‌య‌శాంతి హీరోయిన్లుగా న‌టించారు. బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు, యాక్ష‌న్‌.. బి. గోపాల్ టేకింగ్‌, బ‌ప్పీల‌హ‌రి మ్యూజిక్‌, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాసిన డైలాగులు.. వాటిని బాల‌య్య పలికిన తీరు ఇవ‌న్నీ ఈ సినిమాను సూప‌ర్ హిట్ చేశాయి. ఇక ఓవ‌రాల్‌గా చూస్తే ఘ‌రానా మొగుడు సినిమా 55 కేంద్రాల్లో 50 రోజులు, 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా రు. 10 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

ఇక వెంక‌టేష్ చంటి 33 కేంద్రాల్లో 100 రోజులు ఆడి.. రు. 9 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ 35 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. రు. 8 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక మూడు సినిమాల్లో ఘ‌రానా మొగుడు పై చేయి సాధించ‌గా.. ఆ త‌ర్వాత బాల‌య్య‌, వెంకీ సినిమాలు నిలిచాయి. ఏదేమైనా ముగ్గురు హీరోల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్లు వ‌చ్చిన యేడాదిగా 1992 అరుదైన సంవ‌త్స‌రంగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news