Movies42 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డ హీరోయిన్‌... ఎంత మందితో...

42 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డ హీరోయిన్‌… ఎంత మందితో ఎన్ని సార్లురా బాబు..!

సినిమా ఇండ‌స్ట్రీలో డేటింగ్‌లు, ప్రేమ‌లు, పెళ్లిల్లు, స‌హ‌జీవ‌నాలు కామ‌న్‌. త‌మ‌తో పాటు న‌టించిన న‌టుల‌తోనో లేదా క్రికెట‌ర్ల‌తోనో లేదా ఇత‌ర రంగాల‌కు చెందిన వారో, పారిశ్రామిక‌వేత్త‌ల‌తోనే సినిమా వాళ్లు ప్రేమ‌లు, డేటింగ్‌లు చేస్తూ ఉంటారు. అయితే ఈ డేటింగ్‌లు, స‌హ‌జీవ‌నాలు చేసిన‌ప్పుడు అవి పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే బ్రేక‌ప్‌లు చేసుకున్న జంట‌లు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ వాళ్లు అయితే ఎన్ని సార్లు ప్రేమ‌లో ప‌డ‌తారో ? ఎన్ని సార్లు బ్రేక‌ప్‌లు చెప్పుకుంటారో ? వాళ్ల‌కే తెలియ‌దు.

ఒక‌నాటి హీరోయిన్ కిమ్‌శ‌ర్మ మీకు గుర్తుండే ఉంటుంది. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఖ‌డ్గం సినిమాలో శ్రీకాంత్ ప‌క్క‌న న‌టించిన కిమ్ శ‌ర్మ ముసుగు వేయొద్దు మ‌న‌సు మీద సినిమాలో హాట్ హాట్‌గానే అందాలు ఆర‌బోసింది. కిమ్‌శ‌ర్మ గ‌తంలో ముగ్గురు, న‌లుగురితో ప్రేమాయ‌ణాలు న‌డిపింది. తాజాగా ఆమె త‌న బంధువుల ఇంట్లో పెళ్లికి వ‌చ్చింది. ఆమెతో పాటు భార‌త మాజీ టెన్నీస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్ కూడా హాజ‌ర‌య్యాడు.

ఈ పెళ్లిలో వీరిద్ద‌రు ప‌ట్టు వ‌స్త్రాల‌తో ఫొటోల‌కు పోజులు ఇచ్చారు. కిమ్ – లియాండ‌ర్ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఈ ఫొటోలు ఆమె త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేయ‌డంతో పాటు వెడ్డంగ్ ఫ‌న్ అని క్యాప్ష‌న్ పెట్టింది. వీరిద్ద‌రు గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్నార‌ని.. అందుకే ఎక్క‌డా చూసినా ఈ జంటే క‌నిపిస్తోంద‌ని బాలీవుడ్ మీడియా రాస్తోంది. అయితే కిమ్ ప్రేమ‌లో ప‌డ‌డం ఇదే కొత్త కాదు.

బాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు క్రేజీ హీరోల‌తో ప్రేమ‌లో ప‌డి స‌హ‌జీవ‌నాలు చేసింది. ఆ త‌ర్వాత ప్ర‌ముఖ క్రికెట‌ర్ యువ‌రాజ్‌సింగ్‌తో కూడా ప్రేమ‌లో ప‌డి కొద్ది రోజుల స‌హ‌జీవ‌నాలు చేసింది. ఇవ‌న్నీ విఫలం కావడంతో చివరికి కెన్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ వ్యాపార‌వేత్త వ‌య‌స్సులో కిమ్ కంటే చాలా పెద్ద‌. కేవ‌లం డ‌బ్బు కోస‌మే అత‌డిని పెళ్లి చేసుకుంద‌న్న ప్ర‌చారం కూడా కిమ్‌పై జ‌రిగింది.

ఆ త‌ర్వాత అత‌డికి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు ముంబైలో ఉంటోంది. ఇక లియాండ‌ర్ విష‌యానికి వ‌స్తే గ‌తంలో బాలీవుడ్ ప్ర‌ముఖ హీరో సంజ‌య్‌ద‌త్ మాజీ భార్య‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆమెకు దూరం అయ్యాక ఇప్పుడు కిమ్‌శ‌ర్మ‌తో తిరుగుతున్నాడు. మ‌రి ఇప్పుడు అయినా కిమ్ పెళ్లి బంధంతో కొన‌సాగుతుందో ? పేస్‌కు కూడా దూర‌మ‌వుతుందా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news