Moviesతారక్ పై ఆ హీరోయిన్లు ఎందుకు మనసు పారేసుకుంటున్నారు..?

తారక్ పై ఆ హీరోయిన్లు ఎందుకు మనసు పారేసుకుంటున్నారు..?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు మనువడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక తాత చరిస్మా తో పుట్టిన ఈ హీరో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఊహించని రేంజిలో అటు మాస్ ఫాలోయింగ్ సంపాదించి అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

అరవింద సమేత అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతోకూడా అందరికీ గూస్ బంప్స్ తెప్పించాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తూ ఉండగా ఇటీవల విడుదలైన ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పాలి. ఇలా జూనియర్ ఎన్టీఆర్ నటన చూసిన తర్వాత టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఎంతో మంది హీరోయిన్లు ఫిదా అయిపోతున్నారు.

దీంతో ఈ యంగ్ టైగర్ పై మనసు పారేసుకుని ఒక్కసారైనా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇక ఇలాంటి హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. ఇప్పటికే ఆర్ ఆర్ఆర్ లో రామ్ చరణ్ సరసన నటించినా ఆలియా భట్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయాలని ఉంది అంటూ మొన్నటికి మొన్న ప్రమోషన్స్ లో చెప్పింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే సైతం ఎన్టీఆర్తో సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుందట. ఇక బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న పాయల్ ఘోష్ ఎన్టీఆర్ తో ఒక సినిమా ఛాన్స్ వస్తే చాలు అని అనుకుంటున్నారట ఇలా బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ కూడా టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ పై మనసు పరేసుకున్నారూ అనేది తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news