Moviesరూపాయి కూడా వద్దు..ప్రభాస్ పక్కన ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. గట్టిగా ట్రై...

రూపాయి కూడా వద్దు..ప్రభాస్ పక్కన ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. గట్టిగా ట్రై చేస్తున్న యంగ్ హీరోయిన్..?

యస్.. తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఓ యంగ్ హీరోయిన్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో నటించడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తుందట. అంతేకాదు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడానికి సిద్ధంగా ఉన్నను అంటూ డైరెక్టర్ కు కాల్ చేసి మరీ బ్రతిమలాడుకుంటుందనే వార్త సినీ వర్గాలల్లో వైరల్ గా మారింది. ఇమతకి ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..?

ఆమె మరెవరో కాదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో నాని పక్క్న బొద్దుగా ముద్దుగా క్యూట్ క్యూట్ గా కనిపిస్తూ అల్లరి చేస్తూ ఆటపట్టించిన హీరోయిన్ మెహ్రీన్. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

తెలిసి తెలియక కొన్ని సినిమాలు వదులుకుని..మరికొన్ని సైన్ చేసి ..ఫైనల్ గా ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు పడితే బాధపడకూడదు అనుకుంటూ తన తప్పులను సరిదిద్దుకుంటూ ఈసారి మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ హిట్లు కొట్టకపోయిన యావరేజ్ టాక్ మాత్రం తెచ్చుకుంది.

అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన ఎఫ్3 సినిమాలో నటిస్తున్న అమ్మడు..త్వరలోనే తెరకెక్కబోయే ప్రభాస్-మారుతి సినిమాలో ఛాన్స్ కోసం తెగ ట్రై చేస్తుండట. డైరెక్టర్ తో ఇది వరకే మారుతి డైరెక్షన్ లో రెండు సినిమాలు చేసిన మెహ్రీన్ ఆయనతో ఉన్న చనువు కొద్ది ప్రభాస్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వమని అడుగుతుందట. అంతేకాదు రెమ్యూనరేషన్ అస్సలకి వద్దు.. సెకండ్ హీరోయిన్ అయినా పర్లేదు అంటూ కాల్స్ మీద కాల్స్ చేసి తెగ ఇబ్బంది పెడుతుందట. మరి చూడాలి మారుతి ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news