Moviesబాల‌య్య‌కు ఇష్ట‌మైన వంట‌కాలు ఇవే... వామ్మో ఇదేం మెనూరా బాబూ...!

బాల‌య్య‌కు ఇష్ట‌మైన వంట‌కాలు ఇవే… వామ్మో ఇదేం మెనూరా బాబూ…!

ఆరు పదుల వయసులో ఉన్న బాలయ్య గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రు. 150 కోట్ల గ్రాస్ వసూలు చేసిన అఖండ 50 కేంద్రాలలో అర్థశతదినోత్సవం జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే బాలయ్య వరుస పెట్టి స్టార్ డైరెక్టర్లుగా ఉన్న మలినేని గోపీచంద్ – అనిల్ రావిపూడితో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. మరోవైపు బుల్లితెరపై తాను హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షో సూపర్ డూపర్ హిట్ అయింది.

బాలయ్య లాంటి సీనియర్ హీరో హోస్ట్ చేసిన ఈ టాక్ షోకు అదిరిపోయే వ్యూస్ రావడంతోపాటు జాతీయస్థాయిలో టాప్ షోగా ప్రశంసలు దక్కించుకుంది. విచిత్రమేంటంటే బాలయ్యకు గతంలో ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అటు బుల్లితెరతో పాటు వెండి తెరను కూడా బాలయ్య షేక్ చేస్తున్నాడు. ఆరు పదుల వయసులో ఉన్నా కూడా బాలయ్య ఎప్పుడూ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఈ వయసులో కూడా బాలయ్య మాట, డైలాగుల విషయంలో చాలా పవర్ ఫుల్‌గా ఉంటారు.

బాలయ్య ఈ వయస్సులోనూ ఇంత ఎనర్జీ గా ఉండటానికి ఆయన ఎలాంటి ? ఆహారం తీసుకుంటారు… ఆయన ఆహారం సీక్రెట్ ఏంటి అన్నదానిపై స్వయంగా ఆయనే చెప్పారు. ఆహా యూట్యూబ్ పోస్ట్ చేసిన వీడియోలో తన ఇంట్లో ఒక వంట మనిషి చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడని… తాను ఎప్పుడూ అతడితో పరాచికాలు ఆడుతూ ఉంటానని బాలయ్య చెప్పారు. ఆ వీడియోలో బాలయ్య తన వంట మనిషి కి ఫోన్ చేసి తాను ఈ వారం ఏం తినాలి ? అనే విషయంలో కొన్ని లెక్కలు ఉన్నాయని చెప్పారు. మంగళవారం మెనూ అంటూ తనకు ఇష్టమైన వంటకాల గురించి వంటమనిషితో ఫోన్లో మాట్లాడారు.

దొండకాయ – క్యాలీఫ్లవర్ – బంగాళదుంప కూర చేయాలని వెల్లుల్లి, జీలకర్ర దట్టించి వేయాలని బాలయ్య సూచించారు. వంట మనిషి మూడు కూరలు అవుతున్నాయని చెప్పడంతో బంగాళదుంప ఆపాలని సూచించారు. బాల‌య్యకు ఇంటి భోజ‌నం ఇష్ట‌మ‌ని.. ఆయ‌న ఘాటు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇంటి భోజనం చేయాలని… ఇంటి భోజనం ఆరోగ్యకరం అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news