MoviesNBK 107... బొమ్మకు అప్పుడే బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ క‌నిపిస్తోందే... !

NBK 107… బొమ్మకు అప్పుడే బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ క‌నిపిస్తోందే… !

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఓ వైపు అఖండ హిట్‌.. ఇటు బుల్లితెర మీద బాల‌య్య హోస్ట్ చేసిన టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ షోలో బాల‌య్య హోస్ట్ చేసిన అన్ని ఎపిసోడ్లు పేలిపోతున్నాయి. ఇక అఖండ క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల‌కు, ఇండ‌స్ట్రీకి కొత్త ఊపు ఇచ్చింది. బాల‌య్య కెరీర్‌లో ఫ‌స్ట్ టైం రు. 100 కోట్ల సినిమాగా నిలిచింది.

ఈ జోష్‌లోనే బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, ఆ త‌ర్వాత అనిల్ రావిపూడితో మ‌రో సినిమా, ఆ త‌ర్వాత కె. రాఘ‌వేంద్ర‌రావుతో మ‌రో సినిమా చేసేందుకు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ఇక క్రాక్ సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన మ‌లినేని గోపీచంద్ ఇప్పుడు బాల‌య్య‌తో అదిరిపోయే మాస్ స‌బ్జెక్టును తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ఇంకా సెట్స్‌మీద‌కు వెళ్ల‌కుండానే బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ తెచ్చుకుంటోంది. సినిమాపై అప్పుడే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాను టాలీవుడ్‌లో వ‌రుస‌గా ప్రెస్టేజియ‌స్ సినిమాలు తెర‌కెక్కిస్తోన్న మైత్రీ మూవీస్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక క్రాక్ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌ను ఇప్పుడు బాల‌య్య సినిమాకు కూడా ద‌ర్శ‌కుడు తీసుకున్నాడు.

ఈ సినిమాలో బాల‌య్య‌కు ధీటుగా ఈ జ‌య‌మ్మ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ రోజు ఈ సినిమాలో జ‌య‌మ్మ పాత్ర‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక హీరోయిన్‌గా బాల‌య్య ప‌క్క‌న శృతీహాస‌న్ న‌టిస్తోంది. కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కే ఈ సినిమాలో విల‌న్‌గా క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ న‌టిస్తున్నాడు.

ఇక ప్ర‌కాశం జిల్లాలోని వేట‌పాలెం ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా క‌థ‌తో పాటు ఈ సినిమా పాత్ర‌ల‌కు ఎంచుకుంటోన్న న‌టుల‌ను బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమాకు ముందే మంచి హిట్ క‌ళ క‌నిపిస్తోంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. బుర్రా సాయిమాధ‌వ్ మాట‌లు అందిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news