Moviesమోస్ట్ వాంటెడ్ సోష‌ల్ మీడియా స్టార్‌గా బాల‌య్య‌... ఏం రికార్డురా..!

మోస్ట్ వాంటెడ్ సోష‌ల్ మీడియా స్టార్‌గా బాల‌య్య‌… ఏం రికార్డురా..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. ఓ వైపు అఖండ సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. కెరీర్ ప‌రంగా రు. 100 కోట్లు దాటేసి.. రు. 150 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌కు చేరువ అయ్యింది. మ‌రోవైపు అనిల్ రావిపూడి, మ‌లినేని గోపీచంద్ సినిమాలు.. ఇటు బుల్లితెర ఓటీటీ టాక్ షో అన్‌స్టాప‌బుల్ డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌తో బాల‌య్య జోరు మామూలుగా లేదు.

అస‌లు క‌రోనా త‌ర్వాత పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేస్తే జ‌నాలు థియేట‌ర్ల‌కు వస్తారా ? అన్న సందేహాల‌ను అఖండ ప‌టాపంచ‌లు చేసేసింది. ఇక ఆ క్రేజ్‌కు తోడు ఇప్పుడు బుల్లితెర‌పై కూడా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో కూడా దుమ్ము రేపుతోంది. ఇప్పుడు ఈ షో స‌రికొత్త రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇండ‌స్ట్రీకి చెందిన సెల‌బ్రిటీల‌ను బాల‌య్య త‌న‌దైన చ‌మ్మ‌క్క్‌ల‌తో ప్ర‌శ్న‌లు వేస్తూ టాక్ షోను న‌డిపిస్తోన్న తీరుకు అంద‌రూ ఫిదా అయిపోతున్నారు.

ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య చేస్తున్న హంగామా ఇప్పుడు బాల‌య్య‌ను ఇండ‌స్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ సోష‌ల్ మీడియా స్టార్‌గా మార్చేసింద‌ట‌. రానా చెప్పిన‌ట్టుగా అంద‌రూ పాసింజ‌ర్ ట్రైన్లో వ‌స్తుంటే స‌డెన్‌గా బుల్లెట్ వేసుకువ‌చ్చిన‌ట్టుగా బాల‌య్య దూకుడు ఉంద‌ని ప‌లువురు చ‌మ‌త్క‌రిస్తున్నారు. ఇప్పుడు అటు వెండితెర అయినా.. ఇటు బుల్లితెర అయినా కూడా బాల‌య్య జోరు మాత్రం అన్‌స్టాప‌బుల్ అన్న‌ట్టుగా ఉంది.

బాల‌య్య రికార్డుల‌కు ఇప్ప‌ట్లో బ్రేకుల్లేవు. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news