Moviesబాల‌య్య హీరోయిన్‌ను మోసం చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రు...!

బాల‌య్య హీరోయిన్‌ను మోసం చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రు…!

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలు.. డేటింగ్‌లు.. పెళ్లిళ్లు తర్వాత విడిపోవడం అనేది చాలా కామన్. ఇక్కడ కావాల్సింది అవకాశం… అవకాశాలకోసం ఎప్పుడు ఎవరు ఎవరితో ఉంటారో ? ఎవరు ఎవరితో విడిపోతారో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే ఒకప్పటి హీరోయిన్ హీరా కూడా కెరీర్ బాగున్నప్పుడు వేసిన రాంగ్ స్టెప్ తో ఆమె తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1992లో సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో భానుచందర్ హీరోగా వచ్చిన పబ్లిక్ రౌడీ సినిమాతో టాలీవుడ్‌కు హీరా హీరోయిన్ గా పరిచయమైంది.

అప్పట్లో తెలుగులో పలు హిట్ సినిమాల్లో ఆమె నటించింది. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన యువరత్న రాణా సినిమాలో కూడా ఆమె బాలయ్య పక్కన నటించింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. కెరీర్ పరంగా తెలుగు… తమిళంలో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఆమె టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడింది.

అప్పుడే కెరీర్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సదరు హీరోకు అవకాశాలు ఇప్పించటంలో కూడా ఎంతో సాయం చేసింద‌న్న‌ ప్రచారం అప్పట్లో వినిపించింది. అంతేకాకుండా తాను సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన డబ్బుతో ఒక సినిమాను నిర్మించి … ప్రియుడిని కూడా గ్రాండ్ గా లాంచ్ చేసిందట. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న‌ టైంలో… హీరాకు ఫైనాన్షియల్ సమస్యలు వచ్చాయి. దీంతో సదరు హీరో ఆమెకు హ్యాండ్ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమె తీవ్ర మనస్థాపానికి గురై డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది.

ఆ తర్వాత కొద్ది రోజులకు కోలుకున్న హీరా తిరిగి సినిమాల్లోకి వచ్చి మళ్ళీ సక్సెస్ అయింది. తెలుగులో ఆమె అల్లుడుగారు వచ్చారు – యువ‌ర‌త్న రానా – పాడుతా తీయగా – శ్రీకారం – దొంగల రాజ్యం తదితర సినిమాల్లో నటించింది. సినిమాలకు గుడ్ బై చెప్పిన అనంతరం హీరా పుష్కుర్ మాధ‌వ్‌ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో కలిసి ముంబైలో నివాసం ఉంటోంది. ఏదేమైనా కెరీర్‌లో ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు హీరా ఆ టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడక పోయి ఉంటే ఆమె ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయి ఉండేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news