Moviesశ‌భాష్ తార‌క్‌... ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు భారీ విరాళం..

శ‌భాష్ తార‌క్‌… ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు భారీ విరాళం..

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు ఖ‌చ్చితంగా తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. రెండు న్న‌ర సంవ‌త్స‌రాల నుంచి ఈ సినిమా కోసం అంద‌రూ వెయిటింగ్‌లో ఉన్నారు. ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ త‌ర్వాత ఆయ‌న సినిమా లేక‌పోవ‌డంతో తార‌క్ అభిమానులు కూడా ఆర్ ఆర్ కోసం ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు.

ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడు. ప్ర‌స్తుతం ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ ఏపీ వ‌ర‌ద క‌ష్టాల‌పై చ‌లించాడు. త‌న వంతుగా భారీ విరాళం ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఏపీలో సీమ జిల్లాల‌తో పాటు నెల్లూరు జిల్లాల్లో భారీ న‌ష్టం సంభ‌వించిది. కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది. అస‌లు చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో జ‌న‌జీవ‌నం ఇప్ప‌ట‌కీ కూడా స్తంభించింది.

ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌దారులు కూడా దెబ్బ‌తిన్నాయి. ఈ క్ర‌మంలోనే వీరిని ఆదుకునేందుకు ప‌లువురు ముందుకు వ‌స్తున్నారు. ఈ వ‌ర‌ద బాధితుల క‌ష్టాల‌ను త‌న వంతుగా ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చిన ఎన్టీఆర్ త‌న వంతు సాయం ప్ర‌క‌టించారు. ఏపీ వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్.. రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

ఇక ఇదే క్ర‌మంలో టాలీవుడ్ హీరోలు ప‌లువురు కూడా త‌మ వంతుగా స్పందిస్తే కొంత‌లో కొంత ఊర‌ట ల‌భించిన‌ట్లు అవుతుంది. మ‌రి మ‌న మిగిలిన హీరోలు కూడా స్పందిస్తారేమో ? చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news