Moviesఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచింది ఆయనే..!!

ఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచింది ఆయనే..!!

టాలీవుడ్ లో ఎన్ టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడి గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఈ నందమూరి వారసుడు. ఇక ఎన్టీఆర్ కి రాజమౌళితో ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి మనకు తెలిసిందే. ఇప్పటి వరకు తారక్ రాజమౌళితో మూడు సినిమాలు తెరకెక్కించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ వంటి మూడు సూపర్ హిట్స్ వచ్చాయి. మూడి సినిమాలు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

ఇక ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రీపిట్ అయ్యి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో మరికొద్ది రోజుల్లో మన ముందుకురాబోతున్నారు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇక సంక్రాంతి పండగ కానుకగా జనవరీ 7న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తారక్,రాజమౌళి, చరణ్ ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.ప్రతి రోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు మంచి ప్రమోషన్స్ అందిస్తున్నారు. ముంబై,చెన్నై,హైదరబాద్ ,కర్ణాటక అంటూ రాష్ట్రాలు చుట్టేస్తున్నారు.

ఇక ఈ క్రమంలో మీడియా తో మాట్లాడుతూ ఎన్టీఆర్ తన గత విషయాలను గుర్తుచేసుకున్నాడు. తనకు రాజమౌళి ఎంత హెల్ప్ చేసాడో చెప్పుకొస్తూ..”17ఏళ్లకే హీరోగా వచ్చిన నేను రెండవ సినిమాకే స్టార్‌ స్టేటస్‌ అంటే ఏంటో చూశాను. అయితే కొంత కాలం బాగానే వెళ్లిన కెరీర్ సడెన్ గా రీవర్స్ అయ్యింది వరుస డిజాస్టర్లు పలకరించాయి. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.

ఆ సమయంలో నాకు ఏమౌతుందో నాకే తెలియలేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయంపై మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో పని కూడా చేయలేకపోయా. అంత గందరగోళంగా అనిపించేది. ఆ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది మాత్రం రాజమౌళి. కష్టకాలంలో నా వెంటే ఉన్నాడు. వరుస ఫ్లాపులతో ఉన్న నాతో యమదొంగ లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చి మళ్లీ నన్ను సక్సెస్‌ ట్రాక్‌లో నిలబెట్టారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు నా స్నేహితుడిగా రాజమౌళి ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు” అంటూ చెప్పుకొచ్చారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news