Moviesఎన్టీఆర్ క్రేజ్ చూసి వాళ్లు షేక్ అయ్యారా... !

ఎన్టీఆర్ క్రేజ్ చూసి వాళ్లు షేక్ అయ్యారా… !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడుగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌ ఎన్నో అవరోధాలు ఎదుర్కొని… ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల‌లో ఒక‌రిగా కొనసాగుతున్నారు. నటనలో గానీ… డ్యాన్సుల్లో గారి, డైలాగ్ డెలివరీలో కానీ ఎన్టీఆర్ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలో, అయినా సాంఘిక పాత్రల్లో అయినా తనకు పోటీగా ఈ తరం హీరోల్లో ఎవరు సాటిరారని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ అదిలాబాద్ జిల్లాలో గోండు వీరుడు కొమురం భీం పాత్రల్లోకనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్ లో భాగంగా ఆదివారం ముంబైలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఆలియాభ‌ట్‌, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కరణ్ జోహార్ హాజరయ్యారు. అలాగే ఈ టీమ్‌కు సపోర్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చారు. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చివరకు బారికేడ్లను సైతం బద్దలుకొట్టి గోడ పైకి ఎక్కిన ఎన్టీఆర్ అభిమానులు వి లవ్ యూ ఎన్టీఆర్ అని గట్టిగా కేకలు వేశారు. జై ఎన్టీఆర్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

తెలుగులో ఎన్టీఆర్ కు ఇంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో బాలీవుడ్ మీడియాకు కళ్ళముందు కనపడింది. చివ‌ర‌కు ఈవెంట్‌కు ఇబ్బంది క‌ల‌గ‌డంతో క‌ర‌ణ్‌జోహార్ సైతం ఎన్టీఆర్ అభిమానుల‌ను ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని కామెంట్ చేశార‌ట‌. చివ‌ర‌కు రాజ‌మౌళి, ఎన్టీఆర్ సైతం ప‌ద్ధ‌తిగా ఉండాల‌ని స్వీట్ వార్నింగ్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి. ఏదేమైనా ఎన్టీఆర్‌కు తెలుగు నాట ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో బాలీవుడ్ మీడియాలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news