Moviesర‌జ‌నీ ' పెద్ద‌న్న ' ప్రి రిలీజ్ బిజినెస్‌.. టార్గెట్ ఎన్ని...

ర‌జ‌నీ ‘ పెద్ద‌న్న ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌.. టార్గెట్ ఎన్ని కోట్లంటే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్‌గా ఊర‌మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా పెద్ద‌న్న‌. కుష్బూ, మీనా లాంటి సీనియ‌ర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా ఈ నెల 4న రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటోన్న ఈ సినిమాపై మంచి హైప్ వ‌చ్చేసింది.

విచిత్రం ఏంటంటే ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ రేంజ్‌లో బిజినెస్ చేసిన సినిమాగా పెద్ద‌న్న రికార్డుల‌కు ఎక్కింది. పెద్ద‌న్న సినిమాకు తెలుగులో రు. 12. 2 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రు. 12.5 కోట్ల షేర్ రాబ‌ట్టాలి. ర‌జ‌నీకి తెలుగులోనే రు. 40 కోట్ల మార్కెట్ ఉండేది. అయితే ఆయ‌న సినిమాలు వ‌రుస పెట్టి ప్లాప్ అవుతుండ‌డంతో ఇప్పుడు మార్కెట్ బాగా డ‌ల్ అయ్యింది.

పెద్ద‌న్న ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది…

నైజాం – 4.00 కోట్లు

సీడెడ్ – 2.20 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.45 కోట్లు

ఈస్ట్ -1.00 కోట్లు

వెస్ట్ – 0.82 కోట్లు

గుంటూరు – 1.10 కోట్లు

కృష్ణా – 0.98 కోట్లు

నెల్లూరు – 0.65 కోట్లు
————————————————-
ఏపీ + తెలంగాణ (టోటల్) = 12.20 కోట్లు
————————————————–

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news