Moviesరష్మిక మందన సంచలనం..ఆ విషయంలో స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన కన్నడ...

రష్మిక మందన సంచలనం..ఆ విషయంలో స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన కన్నడ బ్యూటీ..!!

రష్మిక మందన.. ఓ వైపు టాలీవుడ్..ఓ వైపు బాలీవుడ్..మధ్యలో కోలీవుడ్ అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న భామ రష్మిక అనే చెప్పాలి. టాలీవుడ్ లో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తున్నా కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మిక.

ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటింస్తున్న రష్మిక.. బాలీవుడ్‌లోను మూడు చిత్రాల్లో నటిస్తూ అక్కడ ప్రజలను నటన తో తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. ఈ క‌న్న‌డ బ్యూటీ ప్ర‌స్తుతం తెలుగులో పుష్ప‌, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తుంది. త‌మిళం, హిందీ భాష‌ల‌లోను ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మిక.. త‌న పాపులారిటీని మెల్ల‌మెల్ల‌గా పెంచుకుంటూ పోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫాలోవ‌ర్స్‌ని పెంచుకుంటూ ఉంది.

తాజాగా అమ్మడు అందరికి మైడ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది. దక్షిణాది సినీ తారల సోషల్ మీడియా పాపులారిటీ ఆధారంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితా రూపొందించింది.ఇక ఆయా సినీ స్టార్లు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన లాస్ట్ 25 పోస్టులను ఆధారంగా తీసుకున్నారు. ఇందులో రష్మిక మందన్న ఎవరు ఊహించని విధంగా 9.88 పాయింట్లతో అగ్రస్థానంలో నికిచింది. ఇక విజయ్ దేవరకొండ (9.67) రెండోస్థానంలో ..కన్నడ స్టార్ యశ్ (9.54) మూడో స్థానంలో, సమంత (9.49) నాలుగో స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ (9.46) కు ఐదో స్థానం, ప్రభాస్ (9.40) కు ఎనిమిదో స్థానం లభించాయి. దీంతో ఈమె మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news