Moviesప‌వ‌న్ - సురేంద‌ర్‌రెడ్డి సినిమాలో షాకింగ్ హీరోయిన్‌...!

ప‌వ‌న్ – సురేంద‌ర్‌రెడ్డి సినిమాలో షాకింగ్ హీరోయిన్‌…!

పెద్ద హీరోలు కొత్త హీరోయిన్ల‌తో సినిమాలు చేయ‌డం అరుదు. ఎందుకంటే వారి మార్కెట్ ఎక్కువ‌. మార్కెట్లో క్రేజ్ ఉన్న హీరోయిన్ల‌తోనే సినిమాలు చేసేందుకు వారు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం చాలా రోజుల నుంచి కొత్త అమ్మాయిల‌తో సినిమాలు చేయ‌డం లేదు. అప్పుడెప్పుడో పంజా సినిమాలో మాత్ర‌మే ఇద్ద‌రు కొత్త అమ్మాయిల‌తో ప్ర‌యోగం చేసినా విఫ‌ల‌మైంది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ త‌న సినిమా కోసం ఏకంగా ఓ అప్‌క‌మింగ్ హీరోయిన్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ప‌వ‌న్ – సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో వ‌చ్చే కొత్త సినిమాలో హీరోయిన్‌గా సాక్షి వైద్యను ఎంపిక చేశార‌ట‌. సురేంద‌ర్‌రెడ్డి సాక్షి వైద్య‌ను తాను ప్ర‌స్తుతం తీసే ఏజెంట్ సినిమాకు ఎంపిక చేసుకున్నాడ‌ట‌. అయితే ఇప్పుడు ఆమెను ప‌వ‌న్ ప‌క్క‌న సెట్ చేస్తున్న‌ట్టు టాక్ ? సాక్షి వైద్య‌తో నిర్మాత రామ్ తాళ్లూరి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడ‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్ ప‌క్క‌న మ‌రీ ఇంత చిన్న అమ్మాయి అయితే సెట్ అవుతుందా ? ప‌వ‌న్ ఒప్పుకున్నాడా ? లేదా ఇది సురేంద‌ర్ ఆలోచ‌న మాత్ర‌మేనా ? అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే సాక్షి వైద్య లుక్స్ మాత్రం చూడ‌డానికి బాగున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news