Gossipsటాలీవుడ్ యంగ్ హీరోతో లావ‌ణ్య త్రిపాఠి ఎఫైర్‌...?

టాలీవుడ్ యంగ్ హీరోతో లావ‌ణ్య త్రిపాఠి ఎఫైర్‌…?

తెలుగులో అందాల రాక్ష‌సి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది లావ‌ణ్య త్రిపాఠి. ఈ సొట్ట బుగ్గ‌ల చిన్న‌దాని ఎక్స్‌ప్రెష‌న్సే అప్ప‌ట్లో తెలుగు కుర్ర‌కారు ప‌డిపోయేవారు. నాని హీరోగా వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో లావ‌ణ్య సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. అయితే ఆమెకు ఉన్న అందానికి, టాలెంట్‌కు టాప్ హీరోయిన్ రేంజ్‌కు అయితే ఆమె ఎద‌గ‌లేక‌పోయింది. త‌ర్వాత నాగార్జున ప‌క్క‌న సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాలో ఆమె న‌టించింది. ఇదే ఆమెకు పెద్ద హీరో సినిమా అయ్యింది. త‌ర్వాత ఆమె కొత్త త‌రం హీరోయిన్ల పోటీ ముందు ఆగ‌లేక‌పోయింది. లావ‌ణ్య‌కు చిన్నా చిత‌కా అవ‌కాశాలు రావ‌డం కూడా గ‌గ‌న‌మే అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు ఓ తెలుగు యువ హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో సీక్రెట్‌గా ఒక్క‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. లావ‌ణ్య శ్రీర‌స్తే శుభ‌మ‌స్తు సినిమాలో అల్లు శిరీష్ ప‌క్క‌న న‌టించింది. ఈ సినిమా ఓ మోస్త‌రుగా ఆడ‌డంతో పాటు శిరీష్ కెరీర్‌కు కాస్త ఊపు తెచ్చింది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం స్నేహంగా మారి… ఇది ప్రేమ వ‌ర‌కు వెళ్లింద‌ని ఒక్క‌టే గుస‌గుస‌లాడు కుంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు.

ప్ర‌స్తుతం వీరి ప్రేమ చాటింగుల‌ను దాటేసి.. మీటింగ్‌ల వ‌ర‌కు వెళ్లిపోయింద‌ని అంటున్నారు. అటు అల్లు శిరీష్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ త‌న‌యుడు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో. ఇక గ‌తంలోనే ఇదే మెగా ఫ్యామిలీకే చెందిన సాయిధ‌ర‌మ్ – రెజీనా మ‌ధ్య ప్రేమ గురించి ఒక్క‌టే వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు అలాగే శిరీష్‌పై వ‌స్తున్నాయి. మ‌రి ఇది నిజ‌మేనా ? లేక వీరి మీటింగ్‌లు అక్క‌డితో ముగిసిపోతాయా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news